టీకా ఉత్సవ్ కార్యక్రమంలో భాగంగా మూడు రాష్ట్రాల్లో కోటి మందికి వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో.. మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాలు కలిసి కోటికి పైగా డోసులను అందించాయని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరించింది.
దేశవ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కరోనా టీకా వేయడం కోసం ప్రధాని మోదీ.. టీకా ఉత్సవ్‌ను ఏప్రిల్11న ప్రారంభించారు. ఏప్రిల్ 14వరకు ఈ కార్యక్రమం జరిగింది. కాగా దేశవ్యాప్తంగా టీకా ఉత్సవ్‌లో 1,28,98,314 డోసుల్ని పంపిణీ చేశారు.