తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాయల్​ బంగాల్​ టైగర్​ను చంపిన అటవీ సిబ్బంది.. ఎందుకంటే?

అసోంలోని కాజీరంగా జాతీయపార్క్​లో ఓ రాయల్​ బెంగాల్​ టైగర్ మృత్యువాత పడింది. ఉద్యోగి కాల్చడం వల్లే ఆ పులి మృతి చెందినట్లు నిర్ధరించిన అధికారులు అతడిని సస్పెండ్​ చేశారు.

Tiger killing in Kaziranga
బంగాల్​ టైగర్​

By

Published : Jun 29, 2021, 12:43 PM IST

Updated : Jun 29, 2021, 1:57 PM IST

అసోంలోని కాజీరంగా జాతీయపార్క్​లో 10ఏళ్ల వయసు ఉండే రాయల్​ బెంగాల్​ టైగర్​ మృత్యువాత పడింది. ప్రమాదవశాత్తు గార్డు తుపాకీ నుంచి వచ్చిన తూటా పులికి తగలడం వల్ల.. అది అక్కడికక్కడే మరణించింది. ఇందుకుగాను అటవీ సిబ్బందిని ఉన్నతాధికారులు విధుల నుంచి తొలగించారు.

చనిపోయిన బంగాల్​ టైగర్​

ఇదీ జరిగింది...

ఈ నెల 18న పార్క్​ సమీప ప్రాంతమైన జపోరిపాథర్​లో చనిపోయిన రాయల్​ బెంగాల్​ టైగర్​ కళేబరాన్ని అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టారు.

రాయల్​ బంగాల్​ టైగర్​.. స్థానిక గ్రామాల్లో ఉన్న పశువులను వేటాడి చంపేది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది పులిని జనావాసాల్లోకి రాకుండా చేయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో వారు దానిని తుపాకీతో భయపెట్టాలని చూశారు. ఈ క్రమంలో మిస్​ఫైర్​ అయి పులికి బులెట్​ తగిలిందని, దీంతో అది1 అక్కడికక్కడే మరణించినట్లు పార్క్​ డైరెక్టర్​ శివకుమార్ తెలిపారు.

నెల వ్యవధిలో కాజీరంగా జాతీయపార్క్​ పరిధిలో పులులు చనిపోవడం ఇది రెండోసారి. ఈ నెల 5వ తేదీన పార్క్​ అధికారులు ఆడపులి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి:నిర్లక్ష్యంతోనే మూడోదశ ప్రమాదం.. జాగ్రత్తలేవి?

Last Updated : Jun 29, 2021, 1:57 PM IST

ABOUT THE AUTHOR

...view details