మహారాష్ట్ర గోంధియా నగరం చుతియా- లోథితోలా సరిహద్దులోని వ్యవసాయ క్షేత్రంలో ఎలక్ట్రిక్ షాక్ తగిలి ఓ పులి మరణించింది. మరణించిన పులి తలను, కాలి వేళ్లను అపహరించిన దుండగులు.. మిగతా అయవాలను ముక్కలుగా చేసి స్థానిక వ్యవసాయ క్షేత్రాల్లో పడేశారు.
మరణించిన పులి తల, వేళ్లను ఎత్తుకెళ్లిన దుండగులు - మరణించిన పులి తలను ఎత్తుకెళ్లిన దుండగులు
మహారాష్ట్ర గోంధియా నగరం అటవీ ప్రాంతంలో అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ వైర్ తగిలి మూడేళ్ల పులి మరణించింది. స్థానిక రైతులు ఇచ్చిన సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు అక్కడకు చేరుకుని ఆనవాళ్లను పరీక్షించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.
మరణించిన పులి తల, వేళ్లను ఎత్తుకెళ్లిన దుండగులు
పులి అవయవాలను గుర్తించిన రైతులు.. విషయాన్ని అటవీ అధికారులకు తెలియజేశారు. అధికారులు అక్కడికి చేరుకొని అవయవాలను సేకరించారు. పులి వయస్సు మూడేళ్లు ఉంటుందని అధికారులు చెప్పారు. నిందితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ క్షేత్రాలకు ఆనుకొని నగజిరా టైగర్ ప్రాజెక్ట్ ఉండటం వల్ల పులులు సాధారణంగా పొలాల్లోకి వస్తాయని అటవీ అధికారులు వివరించారు.
Last Updated : Nov 16, 2020, 5:34 PM IST