కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న నేపథ్యంలో కేరళలో నిర్వహించే త్రిచూర్ పురం వేడుకపై ఆ రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఆలయ సంప్రదాయం ప్రకారం లాంఛనంగా మాత్రమే వేడుక జరపాలని నిర్ణయించింది. వేడుకలోకి ప్రజలకు అనుమతి ఉండబోదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమవారం నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
కొవిడ్ నియమాలను పాటిస్తూ.. ఆలయ నిర్వహకులు మాత్రమే వేడుకలో పాల్గొననున్నారు. పురం వేడుకను పూర్తి స్థాయిలో నిర్వహిస్తామని గతంలో వెల్లడించిన తిరువంబాడి, పరమెక్కవవు ఆలయ నిర్వహకులు.. ప్రభుత్వ నిర్ణయానికి సమ్మతి తెలిపారు.