ఓ బాలుడిని కుక్కలు దారుణంగా చంపేశాయి. 15 శునకాలు ఒకేసారి దాడి చేసి శరీర భాగాలను వేరు చేశాయి. ఈ ఘటన మహారాష్ట్ర సతారాలోని జగ్‌తప్ వస్తీలో జరిగింది.
ఇదీ జరిగింది..
తల్లి ఇంటి దగ్గర్లలోని పొలంలో పని చేస్తుండగా.. మూడేళ్ల వయసు ఉన్న రాజ్‌వీర్ రాహుల్ హౌవల్ కొంచెం దూరంగా ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో 15 శునకాలు ఒకేసారి రాజ్‌వీర్‌పై దాడి చేశాయి. అతని అవయవాలను దారుణంగా వేరు చేశాయి. కాసేపటి తర్వాత తల్లి.. రాజ్‌వీర్ కోసం వెతకగా అతడు కనిపించలేదు. చివరకు ఇంటికి సమీపంలోని పొలంలో రాజ్‌వీర్ మృతదేహం కనిపించింది. అతడి శరీరాన్ని కుక్కలు ఛిద్రం చేశాయి. ఆ దృశ్యాన్ని చూసిన తల్లి గుండెలు పగిలాయి. బోరున విలపించింది.
హరియాణాలో మరో చిన్నారి..
హరియాణాలోని పానిపత్‌లో సైతం ఓ నవజాత శిశువు కుక్క కారణంగా ప్రాణాలు కోల్పోయింది. సెక్టార్ 13-17 పోలీస్ స్టేషన్ ఏరియాలోని ఆర్ట్ అండ్ మదర్ కేర్ హాస్పిటల్లో మహమ్మద్ భార్య షబ్నమ్ జూన్ 25న డెలివరీ కోసం చేరింది. అదే రోజు రాత్రి 8.15 గంటలకు షబ్నమ్ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం తర్వాత.. ఆస్పత్రి మొదటి అంతస్తులో ఉన్న జనరల్ వార్డులోకి షబ్నమ్‌ను మార్చారు.