Three women Died After Falling Into a Pond in Medak District :బోనాల పండుగ పూట పిల్లల కేరింతలు, పెద్దల హడావిడితో సందడిగా ఉన్న ఆ ఇళ్లు.. ఒక్కసారిగా ఆర్తనాదాలతో నిండిపోయింది. బంధువులతో ముచ్చట్లు పెడుతూ.. మురిపెంగా ఉన్న ఆ కుటుబంల్లో తీరని విషాదం అలుముకుంది. బట్టలు ఉతికేందుకు కుటుంబసభ్యులు, బంధువులు చెరువుకు వెళ్లి, ప్రమాదవశాత్తు అందులో పడిపోయారు. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో బాబు గల్లంతయ్యాడు. ఈ విషాదఘటన మెదక్ జిల్లాలో (Medak District) చోటుచేసుకుంది.
మనోహరాబాద్ మండలం రంగాయపల్లి గ్రామానికి చెందిన ఫిరంగి చంద్రయ్య-లక్ష్మి దంపతుల ఇంటికి.. ఊళ్లో బోనాల పండుగ కోసం బంధువులు వచ్చారు. లక్ష్మి తమ్ముడి కుటుంబం పండుగ కోసం అక్కింటికి చేరుకున్నారు. నిన్నటిరోజు అందరూ పండుగను జరుపుకున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం అందరూ కలిసి బట్టలు ఉతికేందుకు గ్రామ సమీపంలోని ఊర చెరువుకు వెళ్లారు. చంద్రయ్య కుమార్తె లావణ్య, తన మామ కుమారుడు చరణ్‌తో కలిసి ఆడుకునే క్రమంలో.. ఇద్దరు చెరువులో పడిపోయారు.
Live Video : అయ్యో.. ఎంత పనైపాయే.. చూస్తుండగానే కొట్టుకుపోయే
ఇది గమనించిన లక్ష్మి, బాలమణి చెరువులోకి దిగారు. ఈ క్రమంలోనే ఒకరివెంట ఒకరు ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. స్థానికులు వెంటనే చెరువులోకి దిగి.. వారిని బయటికి తీసినా ప్రయోజనం లేకపోయింది. లక్ష్మి, బాలమణి, యువతి లావణ్య అప్పటికే ప్రాణాలు (Three women Died) కోల్పోయారు. గల్లంతైన చిన్నారి చరణ్ ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. గ్రామస్తుల సాయంతో బాబు కోసం గాలిస్తున్నారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం అంబర్‌పేట్‌కు చెందిన లక్ష్మి తమ్ముడి కుటుంబం.. బోనాల పండుగకు రంగాయపల్లికి వచ్చింది.
బైక్‌తో సహా వాగులో పడి ముగ్గురు గల్లంతు.. చూస్తుండగానే..!
పండుగ పూట బాలమణి, ఆమె కుమారుడు నీటిలో మునిగిపోగా.. చంద్రయ్య భార్య లక్ష్మి, బిడ్డ లావణ్య ప్రాణాలు కోల్పోయారు. నిన్నంతా బోనాల పండుగతోసందడిగా ఉన్న ఊళ్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోవటం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరు మృతి, ముగ్గురు విద్యార్థులు గల్లంతు
సంగారెడ్డి జిల్లా ఐలాపూర్‌లో చెరువులో పడి ఒకరి మృతి, ఇద్దరు గల్లంతు