తెలంగాణ

telangana

ETV Bharat / bharat

స్కూల్​లో ఒకే స్టూడెంట్.. టీచర్లు మాత్రం ముగ్గురు.. నెలకు రూ.3లక్షలు ఖర్చు!

ఆ స్కూల్​లో ఒకే ఒక స్టూడెంట్.. టీచర్లు మాత్రం ముగ్గురు.. మధ్యాహ్న భోజనం వండేందుకు మరోకరు.. ఉత్తరాఖండ్​లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పరిస్థితి ఇది. ఈ ఏకవిద్యార్థి పాఠశాలను ప్రభుత్వం నెలకు రూ.3లక్షలు వెచ్చించి నడిపిస్తోంది.

three teachers one student
three teachers one student

By

Published : Dec 25, 2022, 10:21 PM IST

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా ఉపాధ్యాయులు ఉండకపోవటం పరిపాటి. కానీ ఉత్తరాఖండ్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఒక పాఠశాలలో కేవలం ఒక బాలిక ఉండగా... ఉపాధ్యాయులు మాత్రం ముగ్గురు ఉన్నారు. ఆమెకు ముగ్గురు ఉపాధ్యాయులు విద్యా బోధన చేస్తున్నారు. అంతేగాక, విద్యార్థినికి మధ్యాహ్న భోజనం సైతం అందిస్తున్నారు. తెహ్రీ జిల్లా, తాలుల్దార్ బ్లాక్​లోని మార్గావ్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ హైస్కూల్​లో ఈ పరిస్థితి నెలకొంది.

విద్యార్థికి బోధిస్తున్న ఉపాధ్యాయుడు

అయితే, గతంలోనూ ఇక్కడ విద్యార్థులు సంఖ్య తక్కువగానే ఉందని సమాచారం. ఈ గ్రామానికి 2006లో ప్రభుత్వ పాఠశాల మంజూరైంది. అప్పటి నుంచి 2014 వరకు పంచాయతీ భవన్​లో స్కూల్ నడిపించారు. 2014లో ప్రత్యేక భవనం పాఠశాలకు అందుబాటులోకి వచ్చింది. అప్పుడు స్కూల్​లో ఉన్న విద్యార్థుల సంఖ్య 23. ఆ తర్వాత నుంచి ఈ సంఖ్య మరింత తగ్గుతూ వచ్చింది. గతేడాది ఇద్దరు విద్యార్థులు ఉండగా.. ఈ ఏడాది ఒక్క బాలికే మిగిలింది. ప్రస్తుతం ఓ మహిళా టీచర్ సహా ముగ్గురు ఉపాధ్యాయులు ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. మధ్యాహ్న భోజనం వండిపెట్టేందుకు ఓ వంటమనిషి సైతం ఇక్కడ పనిచేస్తున్నారు.

విద్యార్థి

అడవి మధ్యలో ఈ స్కూల్ ఉందని, ఇక్కడి రావడానికి చాలా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పాఠశాల ప్రిన్సిపల్ రాకేశ్ చంద్ డోభాల్ తెలిపారు. వణ్యప్రాణులు సైతం తిరుగుతుంటాయని చెప్పారు. అందుకే చాలా మంది గ్రామస్థులు.. పట్టణాలకు వలస వెళ్లారని వెల్లడించారు. కాగా, ఆ బాలిక కోసం విద్యాశాఖ నెలకు రూ.3లక్షలు వ్యయం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details