నక్సల్స్ ఘాతుకం- ఐదుగురు జవాన్లు మృతి - Chhattisgarh Narayanpur blast
17:27 March 23
నక్సల్స్ ఘాతుకం- ఐదుగురు జవాన్లు మృతి
ఛత్తీసగఢ్ నారాయణ్‌పుర్ జిల్లా కన్హర్గావ్లో నక్సల్స్ ఘాతుకానికి పాల్పడ్డారు. జిల్లా రిజర్వు గార్డు(డీఆర్జీ) జవాన్లు వెళ్తున్న బస్సును ఐఈడీతో పేల్చారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు మృతి చెందారు. మరో 13 మందికి గాయాలైనట్లు ఛత్తీస్‌గఢ్ డీజీపీ అవస్థి తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 20 మందికిపైగా జవాన్లు ఉన్నట్లు వెల్లడించారు.
గాయపడ్డ జవాన్లను 45వ ఐటీబీపీ బెటాలియన్ సైనికులు ఆసుపత్రికి తరలించారు. పేలుడు జరిగిన ప్రాంతంలో నిర్బంధ తనిఖీలు చేపట్టారు.