తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సెప్టిక్​ ట్యాంకులో పడి ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు మృతి - sanitation workers died

Sanitation Workers Died in Mumbai: మహారాష్ట్రలో విషాద ఘటన జరిగింది. ముంబయి నగరంలో సెప్టిక్​ ట్యాంకులో పడి ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు మరణించారు.

sanitation workers died in mumbai
sanitation workers died in mumbai

By

Published : Mar 11, 2022, 9:45 AM IST

Updated : Mar 11, 2022, 10:42 AM IST

Sanitation Workers Died in Mumbai: సెప్టిక్​ ట్యాంకులో పడి ఊపిరాడక ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు మృతి చెందిన విషాద ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబయిలో జరిగింది.

ముంబయి నగర శివారులోని ప్రజా మరుగుదొడ్లు

నగరు శివారు కందివాలి వెస్ట్​లోని ఏక్తానగర్‌లో ఆరునెలల క్రితం ప్రజా మరుగుదొడ్లు (పబ్లిక్ టాయిలెట్) నిర్మించింది మున్సిపల్ కార్పొరేషన్. ఈ మరుగుదొడ్ల ట్యాంక్ నిండిపోవడం వల్ల దానిని శుభ్రం చేయడానికి ముగ్గురు వ్యక్తులను కాంట్రాక్టర్​ పిలింపిచాడు. శుభ్రం చేసేందుకు ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు.. పొరపాటున సెప్టిక్​ ట్యాంకులో పడిపోయారు. దీంతో ఊపిరాడక పోవటం వల్ల ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు, మున్సిపల్ కార్పొరేషన్, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికి తీసి.. శతాబ్ది ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:దేశంలో మరో 4వేల కరోనా కేసులు.. పెరిగిన మరణాలు

Last Updated : Mar 11, 2022, 10:42 AM IST

ABOUT THE AUTHOR

...view details