ఫ్రాన్స్ నుంచి మరో మూడు రఫేల్ యుద్ధవిమానాలు బుధవారం రాత్రి భారత్‌కు చేరుకున్నాయి. ఇప్పటికే తొలి విడతగా 5 జెట్లు రాగా.. ప్రస్తుతం రెండో విడతలో భాగంగా మరో మూడు రఫేల్ విమానాలు దేశానికి చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు గుజరాత్‌లోని జామ్‌నగర్ ఎయిర్‌బేస్‌లో ఈ జెట్లు దిగాయి. దీంతో ఇప్పటివరకు మొత్తంగా 8 రఫేల్ యుద్ధ విమానాలు వాయుసేనకు అందుబాటులోకి వచ్చాయి.
భారత్ చేరుకున్న రెండో విడత రఫెల్ యుద్ధవిమానాలు - Rafale latest news
రెండో విడతలో భాగంగా మరో మూడు రఫేల్ యుద్ధవిమానాలు ఫ్రాన్స్ నుంచి భారత్‌కు చేరుకున్నాయి. గుజరాత్‌లోని జామ్‌నగర్ ఎయిర్‌బేస్‌కు ఈ జెట్లు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో మొత్తంగా ఇప్పటివరకు 8 రఫేల్ యుద్ధ విమానాలు అందుబాటులోకి వచ్చాయి.
భారత్ చేరుకున్న రెండో విడత రఫెల్ యుద్ధవిమానాలు
భారత్, ఫ్రాన్స్ మధ్య 36 రఫేల్ జెట్ల కోసం రూ. 59వేల కోట్ల ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా తొలి విడతగా ఈ ఏడాది జులై 29న 5 యుద్ధ విమానాలు భారత్‌లోని అంబాలా వాయుస్థావరానికి చేరాయి. మరో 28 జెట్లను 2021 చివరి నాటికి ఫ్రాన్స్ అందించనుంది.
Last Updated : Nov 4, 2020, 10:58 PM IST