రాజస్థాన్లోని చిత్తోర్గఢ్లో తెల్లవారుజాము 3 గంటలకు గ్యాస్ లీకై సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఒకే కుంటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గరలోని ఉదయపుర్లోని జిల్లా ఆసుపత్రికి తరలించారు.
సిలిండర్ పేలి కూలిన పై కప్పు- ముగ్గురు మృతి - చిత్తోర్గఢ్లో పేలిన సిలీండర్
రాజస్థాన్లోని చిత్తోర్గఢ్లో సిలిండర్ పేలి ఇంటి పై కప్పు కూలిపోయింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురికి గాయాలయ్యాయి.
సిలీండర్ పేలి.. పై కప్పు కూలీ... ముగ్గురు మృతి
సిలిండర్ పేలిన సమయంలో బాధితులు నిద్రలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతులను ఇంటి యజమాని పురుషోత్తం, అతని తల్లి సజ్నీభాయి, భార్య జమునాదేవిగా గుర్తించారు. పేలుడు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు.