బిహార్ సివాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మితిమీరిన వేగంతో వెళ్తున్న స్కార్పియో.. విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత 3గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. స్తంభాన్ని ఢీకొట్టగానే స్కార్పియోలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్కార్పియోలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. విషయం తెలియగానే స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కరెంట్ స్తంభాన్ని ఢీకొన్న స్కార్పియో.. మంటలు చెలరేగి ముగ్గురు సజీవ దహనం - బిహార్ కరెంటు స్తంభాన్ని ఢీకొని ముగ్గురు మృతి
మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న ఓ స్కార్పియో.. విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగి, స్కార్పియోలో ఉన్న ముగ్గురు ప్రయాణికులు సజీవదహనం అయ్యారు.
అనంతరం సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారులోంచి మృతదేహాలను బయటకు తీశారు. "మంటల్లో కాలిపోవటం వల్ల మృతులను పోలీసులు సరిగా గుర్తించలేకపోయారు. మరణించిన వారిలో ఒకరిని మాత్రమే గుర్తించారు. మృతుడు గొరియాకోఠి పోలీస్ స్టేషన్ పరిధిలోని సారయ్య గ్రామానికి చెందిన బసంత్ కుమార్‌గా తేలింది. మరో ఇద్దరిని గుర్తించాల్సి ఉంది. ఈ ఘటనానంతరం పోలీసులు ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు" అని సంబంధిత వర్గాలు తెలిపాయి. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపడుతున్నారు.