హరియాణలోని గుడ్‌గావ్‌లో విషాదం చోటు చేసుకుంది. వర్షంలో తడవకుండా ఉండేందుకు నలుగురు వ్యక్తులు చెట్టు కిందకు వెళ్లగా.. ఆ చెట్టుపై పిడుగు పడింది. ఈ దుర్ఘటనలో ఒక వ్యక్తి అక్కడే కుప్పకూలి చనిపోగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
గుడ్‌గావ్‌లో శుక్రవారం ఉదయం నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. వానలో తడిసిపోకుండా ఉండేందుకు నలుగురు ఉద్యానవన సిబ్బంది.. ఓ చెట్టు కిందకు వెళ్లగా.. ఆ చెట్టుపై పిడుగు పడింది. క్షణాల్లో వారంతా కుప్పకూలిపోయారు. ఈ దిగ్బ్రాంతికర దృశ్యాలు స్థానిక సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి.