తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉత్తర్​ప్రదేశ్​లో మరో ముగ్గురికి జికా వైరస్​

ఉత్తర్​ప్రదేశ్​ కాన్పుర్​లో మరో ముగ్గురు.. జికా వైరస్(zika virus in india) బారినపడినట్లు తేలింది. దీంతో యూపీలో మొత్తం బాధితుల సంఖ్య నాలుగుకు చేరింది. ఈ నేపథ్యంలో బాధితులతో సన్నిహితంగా ఉన్నవారిని గుర్తించేందుకు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది.

zika virus
జికా వైరస్​

By

Published : Oct 30, 2021, 6:46 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ కాన్పుర్​లో జికా వైరస్(zika virus in india) కలకలం సృష్టిస్తోంది. తాజాగా మరో ముగ్గురికి వైరస్ సోకినట్లు తేలింది. దీంతో ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు... వైరస్ వ్యాప్తి కట్టడికి చర్యలు చేపట్టారు. బాధితులతో సన్నిహితంగా ఉన్నవారిని గుర్తించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాన్పుర్​లో ఇప్పటివరకు మొత్తం నలుగురికి జికా వైరస్​ సోకినట్లు నిర్ధరణ అయింది.

ఆరోగ్య శాఖ అధికారుల పర్యవేక్షణలో జికా వైరస్ బాధితులకు చికిత్స అందిస్తున్నారు. బాధితులను కలిసిన వారిని గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని సీఎంఓ నేపాల్ సింగ్​ తెలిపారు. వైరస్ ఎక్కడి నుంచి వ్యాప్తి చెందిందనే విషయాన్ని ఆరా తీస్తున్నామని చెప్పారు. వైద్య బృందాలు ఈ పనిలో నిమగ్నమయ్యాయని పేర్కొన్నారు.

కాన్పుర్​లో అక్టోబరు 24న తొలి జికా కేసు నమోదైంది. వాయుసేనలో పనిచేసే ఓ అధికారి కొన్నిరోజులుగా జ్వరంతో బాధపడుతూ వాయుసేన ఆస్పత్రిలో చేరారు. ఆయన వద్ద నుంచి సేకరించిన నమూనాలను పుణెలోని ప్రయోగశాలకు పంపించగా.. జికా వైరస్ బారినపడినట్లు నిర్ధరణ అయింది. బాధితుడితో సన్నిహతంగా ఉన్న మరో 22 మందిని అధికారులు ఐసొలేషన్​లో ఉంచారు.

కాన్పుర్​లో జికా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో.. వాయుసేన ఆస్పత్రి, జీఎస్​వీఎం వైద్య కళాశాల, ఉర్సలా, డఫరీన్​, కాన్షీరామ్ ఆస్పత్రికి చెందిన వైద్య నిపుణులతో ఆరోగ్య శాఖ డీఎం విశాఖ్ సమావేశమయ్యారు. వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

ఇవీ చూడండి:

జికా​ వైరస్​పై కేంద్రం అప్రమత్తం​- యూపీకి ప్రత్యేక బృందం

జికా వైరస్.. కరోనా కంటే ప్రమాదకరమా?

ABOUT THE AUTHOR

...view details