తెలంగాణ

telangana

ETV Bharat / bharat

TSPSC PAPER LEAK UPDATE: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల కేసులో మరో ముగ్గురు అరెస్టు - tpaper lekage case

tspsc paper lekage case
tspsc paper lekage case

By

Published : May 24, 2023, 8:53 PM IST

Updated : May 24, 2023, 10:25 PM IST

20:49 May 24

39కి చేరిన అరెస్టుల సంఖ్య

TSPSC paper lekage case : టీఎస్​పీఎస్సీ ప్రశ్న పత్రాల కేసులో నిందితులను అరెస్ట్​ చేస్తున్న సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. ఇప్పటికే 36 మంది ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. తాజాగా మరో ముగ్గురిని అధికారులు అరెస్ట్​ చేశారు. రవి కిశోర్​, విక్రమ్​, దివ్యలను అరెస్ట్​ చేసినట్టు సిట్​ అధికారులు తెలిపారు. ఇందులో విక్రమ్​, దివ్య అన్నాచెల్లెలు. వీరు నల్గొండ జిల్లాకు చెందిన వీరు.. డీఏవో ప్రశ్నపత్రం కొన్నట్టుగా అధికారులు గుర్తించారు. మరో నిందితుడు రవి కిశోర్​ ఏఈ ప్రశ్న పత్రం అమ్మినట్టుగా అధికారులు పేర్కొన్నారు. దీంతో మొత్తం ఈ కేసులో అరెస్ట్​ చేసిన నిందితులు సంఖ్య 39కి చేరుకుంది. ఈ కేసును సిట్ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరిన్ని విషయాలు బయటకి వచ్చే అవకాశం ఉందని.. నిందితుల సంఖ్య పెరిగే వీలు ఉందని అధికారులు వెల్లడించారు.

అరెస్టుల సంఖ్య 50కి చేరవచ్చు : కమిషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని రోజుల తరబడి ప్రశ్నించి సిట్ అధికారులు వాంగ్మూలం తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కష్టసాధ్యమైన పనికి సిద్ధమయ్యారు. గ్రూప్‌1, ఏఈ, ఏఈఈ, డీఏవో తదితర పరీక్షలు రాసిన అభ్యర్థుల జవాబు పత్రాలను పరిశీలించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఒక్కో అభ్యర్థికి వచ్చిన మార్కులు ఆధారంగా లిస్ట్​ను తయారు చేసుకున్నారు. వారిలో ఎక్కువ మార్కులు తెచ్చుకొన్న అభ్యర్థులను వేరు చేశారు. వారి ఫోన్‌ నంబర్లను గుర్తించి.. విచారించే పనిలో పడ్డారు. వారి బ్యాంకు ఖాతాలను సైతం పరిశీలించారు.

39కి చేరుకున్న నిందితుల అరెస్టుల సంఖ్య : ఆ అభ్యర్థుల ప్రతిభ, సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు సిట్‌ అధికారులు కొన్ని ప్రశ్నావళిని రూపొందించి సమాధానాలు రాబట్టారు. వాటిని అంచనా వేసి అసలు నిందితులను గుర్తించారు. 20 మంది నిందితులు ఉండొచ్చని మొదట భావించారు. జవాబు పత్రాల పరిశీలనతో 39 మంది నిందితులుగా గుర్తించారు. ఈ సంఖ్య 50కు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. మరి కొన్ని రోజుల్లో నిందితులను అరెస్ట్‌ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. సుమారు రూ.50లక్షల సొమ్ము చేతులు మారి ఉండొచ్చని తెలుస్తోంది. ఈ ఏడాది మార్చి నెలలో 7,8 తేెదీల్లో టీఎస్​పీఎస్సీ ప్రశ్న పత్రాలు లీకైనట్లు వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి దీనిపై సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి :

Last Updated : May 24, 2023, 10:25 PM IST

ABOUT THE AUTHOR

...view details