తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ముగ్గురు ముష్కరులు హతం - kashmir news today

Encounter in Kashmir: జమ్ముకశ్మీర్‌ శ్రీనగర్​ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. లష్కరే తోయిబా ఉగ్రముఠాకు చెందిన వారిగా గుర్తించారు.

encounter
ఎన్​కౌంటర్​

By

Published : Dec 8, 2021, 10:42 PM IST

Kashmir Shopian Encounter: జమ్ముకశ్మీర్​లోని షోపియాన్‌లో బుధవారం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. బలగాల కాల్పుల్లో ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. చాకీ చోలన్ గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారం మేరకు భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్​ను ప్రారంభించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు అనూహ్యంగా భద్రతా దళాలపై కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. దీనితో కార్డన్ సెర్చ్ కాస్త.. ఎన్‌కౌంటర్‌గా మారిందన్నారు. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు.

మృతిచెందిన వారిని అమీర్ హుస్సేన్, రయీస్ అహ్మద్, హసీబ్ యూసుఫ్‌గా గుర్తించారు. వీరంతా భద్రతా బలగాలు, పౌరులపై దాడులకు పాల్పడ్డారని, అనేక ఉగ్ర నేరాల్లో నిందితులుగా ఉన్నారని పోలీసులు తెలిపారు.

  • అమీర్ హుస్సేన్ సెప్టెంబరు 2020 నుంచి ఉగ్ర కార్యకలాపాల్లో క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. యువతను ఉగ్రవాదంలో చేరేలా ప్రోత్సహిస్తున్నాడు.
  • రయీస్ అహ్మద్ సైతం జూన్ 2021 నుంచి చురుకుగా ఉగ్రకార్యకలాపాలు సాగిస్తున్నాడు. పలు సందర్భాల్లో పోలీసులపై దాడిలో పాల్గొన్నాడు.
  • హసీబ్ యూసుఫ్​కు కుల్గామ్ ప్రాంతంలో అనేక ఉగ్రవాద నేరాల్లో ప్రమేయం ఉంది.

మరణించిన వారి వద్ద నుంచి ఒక ఏకే-74 రైఫిల్ సహా.. రెండు పిస్టళ్లు, ఇతర ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు పోలీసులు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details