కశ్మీర్లో(Kashmir News) మరోసారి ఉగ్రమూకలు రెచ్చిపోయాయి. వేర్వేరు చోట్ల ముష్కరులు జరిపిన దాడిలో(Terrorist Attack) ఒక పౌరుడు మృతిచెందాడు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ రెండు ఘటనలు శ్రీనగర్‌లోనే జరిగినట్లు పోలీసులు తెలిపారు.
మొదటి దాడి శనివారం సాయంత్రం 5:50 గంటలకు జరిగినట్లు వివరించారు. శ్రీనగర్‌లోని(Srinagar News) కరన్నగర్కు చెందిన మజీద్ అహ్మద్‌పై కాల్పులు జరిపగా.. అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. రాత్రి 8గంటల సమయంలో మరోసారి ముష్కరులు కాల్పులకు పాల్పడగా.. ఓ పౌరుడు తీవ్రంగా గాయపడ్డాడు.