Three Members of a Family Murdered: ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్గర్లో ఒళ్లు గగుర్పొడిచే ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులను దారుణంగా హత్య చేశారు దుండగులు. పదునైన ఆయుధాలతో చంపి, మృతదేహాల ముఖాలను రాళ్లతో ఛిద్రం చేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. కాపూ పోలీసు స్టేషన్ పరిధిలోని ధావాయ్దండ్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి హత్య.. రాళ్లతో ముఖాలు ఛిద్రం.. - Three Members of a Family Murdered in Chattisgarh
Three Members of a Family Murdered: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులను దారుణంగా హత్య చేశాడు దుండగులు. పదునైన ఆయుధాలతో చంపి, మృతదేహాల ముఖాలను రాళ్లతో ఛిద్రం చేశారు. ఈ దారుణ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది.
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి హత్య
బాధితులను దుష్టి బాయి (60), అమృతలాల్ (30), అమృత బాయి(15)లుగా గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన వీరు తల్లి, కొడుకు, మనవరాలు అని పోలీసులు తెలిపారు. అయితే.. వీరు గత నెలలోనే ఈ ప్రాంతానికి వచ్చారని చెప్పారు. పాతపగలే ఈ నేరానికి కారణం అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి:నగరం నడిబొడ్డున కాలిబూడిదైన బస్సు.. అంతా క్షణాల్లోనే..!