Family suicide Facebook live: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. చనిపోయే ముందు ఫేస్బుక్లో లైవ్ ఇచ్చారు. బంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లా బక్కలి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మృతులను శ్యామల్ నాస్కర్, అతడి భార్య రీటా నాస్కర్, కుమారుడు అభిషేక్ నాస్కర్లుగా గుర్తించారు.
ఫేస్బుక్ లైవ్‌లో ఆత్మహత్య FB live suicide bengal
తమ సోదరి ఆర్థిక మోసానికి పాల్పడిందని ఓ ఫైనాన్స్ కంపెనీ ఆరోపించడం వల్లే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సూసైడ్ నోట్లో మృతులు వెల్లడించారు. ఫైనాన్స్ కంపెనీ ఆరోపణల వల్ల.. తన సోదరి శారీరకంగా, మానసికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొందని అభిషేక్ తెలిపారు. లైంగికంగానూ ఆమెను వేధింపులకు గురిచేశారని చెప్పారు. ఈ అవమానాలను భరించలేకే ఆత్మహత్యకు పాల్పడుతున్నామని వివరించారు.
ఇదీ చదవండి:లోన్ ఇవ్వలేదని బ్యాంక్‌నే తగలబెట్టాడు!