ఈశాన్య రాష్ట్రాలు అసోం, మేఘాలయ, మణిపుర్లో భూకంపం(Earthquake) సంభవించింది. శుక్రవారం తెల్లవారుజామున కేవలం కొన్ని గంటల వ్యవధిలో ఆ రాష్ట్రాల్లో భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు.
అసోంలోని తేజ్‌పుర్‌లో ఉదయం 2.04 నిమిషాలకు భూకంపం(Earthquake) సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. రిక్టర్‌స్కేల్‌పై భూకంప తీవ్రత 4.1గా నమోదైనట్లు పేర్కొన్నారు. తేజ్‌పుర్‌కు పశ్చిమ-వాయవ్య దిశలో 36 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.