అసంపూర్ణంగా చెక్కి ఉన్న మూడు గుహలు.. మహారాష్ట్రలోని నాసిక్‌లో బయటపడ్డాయి. ఇవి బుద్ధుని కాలానికి చెందినవని విశ్లేషకులు చెబుతున్నారు. నాసిక్‌లోని త్రిరశ్మి బుద్ధ గుహలకు పైభాగంలో 2,565వ బుద్ధ పూర్ణిమ రోజు ఇవి బయల్పడటం విశేషం.
ఈ మూడు గుహలు 2,200 ఏళ్ల కంటే పురాతనమైనవని పురాతత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇవి అసంపూర్ణంగా చెక్కి ఉన్నాయని తెలిపారు. నాసిక్‌లో ఇప్పటివరకు బయటపడ్డ గుహల్లో ఇవే అత్యంత పురాతమనమైనవని అసిస్టెంట్ సీనియర్ గార్డియన్ అతుల్ భోసేకర్ తెలిపారు.
రాకేశ్ షిండే, మైత్రేయి భోసేకర్(ఆర్కియాలజిస్టు), సునీల్ ఖారే(స్క్రిప్ట్ ఎక్స్పర్ట్), సలీమ్ పటేల్(సీనియర్ ఉద్యోగి, ఏఎస్ఐ), సాక్షి భోసేకర్ సభ్యులుగా ఉన్న ఆర్కియాలజీ బృందం ఈ గుహలను కనుగొంది. దీనిపై తాము డాక్యుమెంటేషన్ తయారు చేస్తామని త్వరలోనే ఏఎస్ఐ(ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా) ముందు ప్రదర్శిస్తామని వారు చెప్పారు. వీటిని సంరక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో మరిన్ని గుహలు బయటపడే అవకాశం ఉందన్నారు.