తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరెంట్​ షాక్​ తగిలి ముగ్గురు రైతులు దుర్మరణం - కరెంట్​ షాక్​తో ముగ్గురు రైతుల మృతి

కరెంట్​ షాక్​ తగిలి ముగ్గురు రైతులు మృతి చెందిన ఘటన కర్ణాటకలో జరిగింది. పొలంలో కిందపడి ఉన్న విద్యుత్ తీగ​పై ఒకరు కాలు మోపి చనిపోగా.. అతడ్ని కాపాడే ప్రయత్నంలో మరో ఇద్దరు మరణించారు.

Three farmer with electric shock
కరెంట్​ షాక్​ తగిలి ముగ్గురు రైతుల మృతి

By

Published : Nov 6, 2022, 8:27 PM IST

Updated : Nov 6, 2022, 9:09 PM IST

కరెంట్​ షాక్​ తగిలి ముగ్గురు రైతులు మృతి చెందిన ఘటన కర్ణాటకలో జరిగింది. వీరందరు మైసూర్​ జిల్లా టినరసిపుర్ గ్రామానికి చెందిన రాచే గౌడ, హరీశ్​, మహదేవ్​స్వామిగా పోలీసులు గుర్తించారు.

పోలీసుల కథనం ప్రకారం..
వ్యవసాయ క్షేత్రంలో కిందపడి ఉన్న విద్యుత్ తీగ​పై రాచే గౌడ కాలు మోపాడు. దీంతో అతడు షాక్​కు గురయ్యాడు. రాచే గౌడ షాక్​ తగిలి విలవిలాడటం చూసి కాపాడాబోయిన మహదేవ్​స్వామికి షాక్​ కొట్టింది. వీరిద్దరిని కాపాడేందుకు వెళ్లిన హరీశ్ సైతం షాక్​కు గురయ్యాడు. దీంతో ముగ్గురూ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపిన పోలీసులు.. దర్యాప్తు జరుపుతున్నామన్నారు.

Last Updated : Nov 6, 2022, 9:09 PM IST

ABOUT THE AUTHOR

...view details