ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / bharat

స్టీల్​ ప్లాంట్​లో గ్యాస్​ లీక్​- ముగ్గురు మృతి - దుర్గాపుర్​ స్టీల్​ ప్లాంట్​లో గ్యాస్​ లీకేజ్

Durgapur Steel Plant Gas Leak: దుర్గాపుర్​ స్టీల్​ ప్లాంట్​లో గ్యాస్​ లీకై ముగ్గురు కార్మికులు మృతి చెందారు. మరో ఐదురుగు గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

gas leak in Durgapur Steel Plant
gas leak in Durgapur Steel Plant
author img

By

Published : Feb 18, 2022, 5:49 PM IST

Durgapur Steel Plant Gas Leak: బంగాల్​లోని దుర్గాపుర్​ స్టీల్​ ప్లాంట్​లో గ్యాస్ లీకై ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ఐదుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. మృతులను సజల్​ చౌహాన్​, సింతూ యాదవ్​, సంతోష్​ చౌహాన్​గా గుర్తించారు.

in article image
సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది

అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగినట్లు కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ప్లాంట్​ ఆధునికీకరణకు నోచుకోకపోవడం వల్ల కార్మికులు బాధితులుగా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు కార్మికులకు సరైన భద్రతా శిక్షణ ఇవ్వకపోవడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నట్లు చెప్పారు.

గాయపడినవారిని వాహనాల్లో తరలిస్తున్న వైద్య సిబ్బంది

మరోవైపు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు ప్లాంట్​ యాజమాన్యం తెలిపింది.

ఇదీ చూడండి:గ్రామస్థులపైకి దూసుకొచ్చిన ఏనుగు.. కానీ ఒకే ఒక్కడు..

ABOUT THE AUTHOR

...view details