తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అనాథాశ్రమంలో ఫుడ్​ పాయిజన్​.. ముగ్గురు మృతి.. 11 మందికి అస్వస్థత

ఓ అనాథాశ్రమంలో ఫుడ్​ పాయిజన్​ కావడం వల్ల ముగ్గురు బాలురు మృతిచెందారు. మరికొంత మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

food poisoning Tamil Nadu
food poisoning Tamil Nadu

By

Published : Oct 6, 2022, 5:03 PM IST

Updated : Oct 6, 2022, 7:19 PM IST

తమిళనాడులో దారుణం జరిగింది. ఆహారం విషతుల్యమై ముగ్గురు బాలురు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 11 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అందులో ముగ్గురు బాలురకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

అధికారుల వివరాల ప్రకారం..తిరుపుర్​లో ఉన్న అనాథాశ్రమంలోని చిన్నారులు బుధవారం రాత్రి రసం కలిపిన అన్నం, లడ్డు తిన్నారు. అనంతరం కొంతమంది వాంతులు చేసుకున్నారు. గురువారం ఉదయం బ్రేక్​ ఫాస్ట్​ చేసిన తర్వాత వారి పరిస్థితి మరింత విషమం అయ్యింది. కొంతమంది అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీంతో ఆశ్రమం సిబ్బంది వారందరినీ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత వారిని తిరుపుర్​, అవినాశిలోని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు.

అయితే, వారిలో 8 నుంచి 13 ఏళ్ల వయసు కలిగిన ముగ్గురు బాలురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మిగతా వారు చికిత్స పొందుతున్నారు. అందులో ముగ్గురు ఐసీయూలో ఉన్నారు. ఈ ఘటనపై తిరుపుర్​ జిల్లా కలెక్టర్ ఎస్ వినీత్ స్పందించారు. బాలురు చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. ఆహారం నమూనాలు సేకరించామని, పరీక్షల నిమిత్తం ల్యాబ్​కు పంపించామని చెప్పారు. ఈ ఘటనపై విచారణ అనంతరం దోషులుగా తేలితే శ్రీ వివేకానంద అనాథాశ్రమంపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్​ తెలిపారు. అయితే ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, అనాథాశ్రమం నడుపుతున్న వ్యక్తులను విచారిస్తున్నారని తెలిపారు.

కాగా, ఈ ఘటనపై జాతీయ బాలల హక్కుల కమిషన్ స్పందించింది. ఈ ఘటనపై సత్వరమే విచారణ జరపాలని తమిళనాడు చీఫ్ సెక్రెటరీకి లేఖ రాసింది. ఆస్పత్రిలో ఉన్న చిన్నారులకు మెరుగైన చికిత్స అందించేలా అధికారులను ఆదేశించాలని స్పష్టం చేసింది. చిన్నారుల హక్కులకు భంగం కలిగిందని పేర్కొన్న కమిషన్.. 48 గంటల్లోగా దీనిపై వివరాలు సమర్పించాలని సీఎస్​ను ఆదేశించింది.

ఇవీ చదవండి:యాక్సిడెంట్​లో 33మంది మృతి.. ఆ పాప మాత్రం సేఫ్.. చనిపోయిన తల్లి గుండెను 12గంటలు హత్తుకుని..

సోనియా, రాహుల్​ పాదయాత్ర.. అమ్మ షూ లేస్​ కట్టిన కుమారుడు

Last Updated : Oct 6, 2022, 7:19 PM IST

ABOUT THE AUTHOR

...view details