తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆస్పత్రి ఎదుట అంబులెన్సుల క్యూ- ముగ్గురు మృతి - రాజీవ్​ గాంధీ ఆస్పత్రి కరోనా వార్తలు

పడకల కొరతతో ముగ్గురు కొవిడ్​ రోగులు అంబులెన్సుల్లోనే ప్రాణాలు కోల్పోయిన సంఘటన తమిళనాడులో జరిగింది. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ.. చెన్నైలోని ఆస్పత్రికి అంబులెన్స్​లో వచ్చారు.

Rajiv Gandhi Hospital, Chennai
రాజీవ్ గాంధీ ఆస్పత్రి, చెన్నై

By

Published : May 14, 2021, 10:10 AM IST

Updated : May 14, 2021, 11:15 AM IST

ఆస్పత్రి ఎదుట అంబులెన్సుల క్యూ- ముగ్గురు మృతి

చెన్నైలో కొవిడ్​ ఉద్ధృతి రోజురోజుకూ ఉగ్రరూపం దాల్చుతున్న వేళ.. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కరోనా రోగులతో నిండిపోయాయి. ఈ నేపథ్యంలో శ్వాస సంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో చేరేందుకు వచ్చిన ముగ్గురు కొవిడ్​ బాధితులు పడకలు లేక.. అంబులెన్స్​లోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన నగరంలోని రాజీవ్​ గాంధీ ఆస్పత్రి వద్ద జరిగింది.

ఏం జరిగిందంటే?

చెన్నై, చెంగల్​పేట్​, తిరవల్లూరు జిల్లాలకు చెందిన ముగ్గురు కరోనా రోగులు శ్వాస సంబంధిత ఇబ్బందులతో రాజీవ్​ గాంధీ ఆస్పత్రిలో చేరేందుకు వచ్చారు. ఆ సమయంలో వారికి పడకలు అందుబాటులో లేనందున.. అంబులెన్స్​లోనే వేచి ఉండాల్సి వచ్చింది. పరిస్థితి విషమించడం వల్ల.. అత్యవసర వాహనంలోనే చనిపోయారు. అంతకముందు అదే ఆస్పత్రిలో నలుగురు వైరస్​ బాధితులు ఇదే సమస్యతో మరణించారు. దీంతో అక్కడ మొత్తం మృతుల సంఖ్య 7కు పెరిగింది.

ఇదీ చదవండి:'కరోనా మహమ్మారి మరోమారు ఉగ్రరూపం'

Last Updated : May 14, 2021, 11:15 AM IST

ABOUT THE AUTHOR

...view details