తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తాజ్​​మహల్​లో పూజలు చేసిన ముగ్గురు అరెస్టు

ప్రంపంచ ప్రఖ్యాత పర్యాటక క్షేత్రం తాజ్​మహల్​లో పూజలు నిర్వహించారనే ఆరోపణలతో ముగ్గురని అరెస్టు చేసింది సీఐఎస్​ఎఫ్​. ఈ అరెస్టులను ఖండిస్తూ ఆందోళనకు దిగారు హిందూ మహాసభ కార్యకర్తలు.

Three arrested for performing puja inside Taj Mahal
తాజ్​​మహల్​లో పూజలు చేసిన ముగ్గురు అరెస్టు

By

Published : Mar 11, 2021, 4:36 PM IST

ప్రపంచ ప్రఖ్యాత తాజ్​మహల్​లో పూజలు నిర్వహించారనే ఆరోపణలతో ముగ్గురు హిందూ మహాసభ కార్యకర్తలను గురువారం అరెస్టు చేసింది.. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్). తొలుత 8 మందిని అదుపులోకి తీసుకోగా అనంతరం ఐదుగురిని విడిచిపెట్టారు. 'మహా శివరాత్రి' పర్వదినం సందర్భంగా తాజ్​మహల్​లోని డయానా బెంచ్​ వద్ద హిందూ మహాసభ అధ్యక్షురాలు మీనా దివాకర్, ఆమె మద్దతుదారులు పూజలు చేశారని సమాచారం.

ఈ అరెస్టులను నిరసిస్తూ హిందూ మహాసభ కార్యకర్తలు ఆందోళనలు చేశారు. వారిని వెంటనే విడుదల చేయకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.

"తాజ్​మహల్​ను మేము ఎప్పటినుంచో శివ మందిరంగా భావిస్తున్నాం. మహా శివరాత్రి సందర్భంగా హారతినిచ్చిన మీనా దివాకర్​ను సీఐఎస్​ఎఫ్​ అరెస్టు చేసింది. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. తేజో మహల్ (తాజ్ మహల్) మా జన్మహక్కు. ఈ కట్టడంలో నమాజ్​ చేయడం ద్వారా మైనారిటీలు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించారు."

-సంజయ్ జాట్, హిందూ మహాసభ అధికార ప్రతినిధి

తాజ్​మహల్​లో శివాలయం..

"తాజ్​మహల్​ను తవ్విచూస్తే మహాశివుని విగ్రహం బయటపడుతుంది. ఒకవేళ అలా జరగకపోతే ప్రాణ బలిదానానికి సిద్ధంగా ఉన్నా. అయోధ్యలో రామ మందిర అవశేషాలు లభించినట్లే తాజ్​మహల్​లో శివాలయం బయటపడుతుంది." అని సంజయ్​ అన్నారు.

ఇదీ చూడండి:బాలికతో మత మార్పిడి- యువకుడి అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details