Leopard Killed: చిరుతను వేటాడి ఆ మాంసంతో ముగ్గురు దుండగులు విందు చేసుకున్నారు. అంతేకాదు.. ఆ చిరుత చర్మాన్ని, గోళ్లను అక్రమ రవాణా చేసేందుకు యత్నించారు. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన బంగాల్లోని సిలిగుడీలో వెలుగులోకి వచ్చింది.
సోషల్ మీడియా ద్వారా..
చిరుత వేటాడిన ఫొటో నిందితులు సోషల్ మీడియాలో షేర్ చేయడం వల్ల ఆ ఘటన అధికారుల దృష్టికి వచ్చింది. దీనిపై వైల్డ్‌లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో ఆ రాష్ట్ర అటవీ శాఖ, సశస్త్ర సీమా బల్కు సమాచారం అందించింది. దర్యాప్తు చేపట్టిన అధికారులు 15 రోజుల తర్వాత నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితులు ముకేశ్ కేకెట్టా, పితలుష్ కేర్‌కెట్టాలను అరెస్ట్ చేసి.. వారి నుంచి చిరుత చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.
అధికారులు స్వాధీనం చేసుకున్న చిరుత చర్మం అయితే నిందితుల వద్ద చిరుత గోళ్లు లభించలేదని.. దీనిపై మరింత దర్యాప్తు చేపడతామని అధికారులు పేర్కొన్నారు. వీటిని నిందితులు నేపాల్‌కు తరలించేందుకు యత్నించినట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చూడండి :కాఫీ తోటలో కార్మికులపై ఏనుగు దాడి- ఇద్దరు మృతి