Threatening Mail To Mukesh Ambani :ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీకి మరోసారి బెదిరింపు మెయిల్ వచ్చింది. అంబానీకి ఇప్పటికే రెండు సార్లు ఇలా బెదిరింపు మెయిళ్లు రాగా.. మూడోసారి కూడా అదే అకౌంట్ నుంచి మెయిల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. తాజాగా వచ్చిన మెయిల్లో రూ.400 కోట్లు డిమాండ్ చేశాడు ఆగంతకులు. భారత్‌లో తమ వద్ద మంచి షూటర్లు ఉన్నారని.. ఆ మొత్తం ఇవ్వకపోతే కాల్చి చంపేస్తామని ముకేశ్‌ను బెదిరించారు.
సోమవారం వచ్చిన ఈ మెయిల్‌పై ముంబయిలోని గామదేవి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే ముకేశ్ అంబానీ ఇంట్లో సీనియర్ అధికారులు సమావేశమయ్యారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతామని పోలీసులు పేర్కొన్నారు. కాగా అక్టోబర్ 27న రూ.20 కోట్లు డిమాండ్ చేస్తూ.. ముకేశ్ అంబానీకి ఓ బెదిరింపు మెయిల్ వచ్చింది. ఆ తరువాత మరో రూ.200 కోట్లు డిమాండ్ చేస్తూ ఇంకో మెయిల్ పంపించారు ఆగంతకులు.
అంబానీ కుటుంబ సభ్యులకు బెదిరింపులు..
గతంలోనూ అంబానీ కుటుంబానికి ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. 2022 ఆగస్టు 15న ఓ వ్యక్తి నుంచి హర్‌కిసాన్‌దాస్ ఆస్పత్రికి బెదిరింపు ఫోన్ వచ్చింది. రిలయన్స్ ఫౌండేషన్ అధ్వర్యంలో ఆ ఆసుపత్రి నడుస్తోంది. హాస్పిటల్‌ను పేల్చేస్తామని, అంబానీ కుటుంబాన్ని చంపేస్తామని.. నిందితుడు ఆ సమయంలో బెదిరించాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ వ్యక్తిని అరెస్టు చేశారు.