మహారాష్ట్ర ముంబయిలో.. కొత్తగా నిర్మిస్తున్న నవీ ముంబయి(Navi Mumbai) అంతర్జాతీయ విమానాశ్రయానికి స్థానిక దివంగత నేత డీబీ పాటిల్ పేరు పెట్టాలంటూ వేలాదిమంది పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఆగస్టు 15 కల్లా ఈ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాయ్‌గఢ్, థానే, పాలగఢ్కు చెందిన వేల మంది సీబీడీ బేలాపుర్లో ఆందోళనలు చేపట్టారు.
విమానాశ్రయం పేరు మార్చాలంటూ ఆందోళన! - మహారాష్ట్రలో ఆందోళన
మహారాష్ట్ర ముంబయిలోని సిబీడీ బేలాపుర్లో దాదాపు 10,000 మందికిపైగా ఆందోళనకు దిగారు. కొత్తగా నిర్మిస్తున్న ఎయిర్‌పోర్టు పేరు మార్చాలని డిమాండ్ చేశారు.
![విమానాశ్రయం పేరు మార్చాలంటూ ఆందోళన! maharashtra](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12251761-thumbnail-3x2-maha.jpg)
మహారాష్ట్ర, ఆందోళన
దాదాపు 10,000 మందికి పైగా నిరసనకారులు ప్రభుత్వ రంగ సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నూతన విమానాశ్రయానికి శివసేన దివంగత బాల్ ఠాక్రే పేరు పెట్టకూడదని డిమాండ్ చేశారు. అయితే.. ఈ ఆందోళనలో భాజపా కార్యకర్తలతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలూ పాల్గొనడం గమనార్హం.
ఇదీ చదవండి:'భాజపాతో రాజీ మేలు'- ఆ సీఎంకు ఎమ్మెల్యే లేఖ
Last Updated : Jun 25, 2021, 7:48 AM IST