తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆంక్షల వేళ.. అంతిమ యాత్రకు పోటెత్తిన జనం - ఉత్తర్​ప్రదేశ్​ కరోనా వార్తలు

ఉత్తర్​ప్రదేశ్​లోని బదాయు జిల్లాలో ఓ మత గురువు అంతిమయాత్రకు వేల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. కొవిడ్​ నిబంధనల ఉల్లంఘించిన ఈ ఘటనను పోలీసులు సీరియస్​గా తీసుకోని.. కేసు నమోదు చేశారు.

crowd gathers at funeral, ఉత్తర్​ప్రదేశ్​ కరోనా వార్తలు
వేల సంఖ్యలో తరలివచ్చిన జనం

By

Published : May 11, 2021, 12:18 PM IST

దేశంలో కరోనా విజృంభణ ఆందోళన కలిగిస్తుంటే.. పలు చోట్ల ప్రజలు మాత్రం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడుతున్నారు. ఉత్తర్​ప్రదేశ్​లోని బదాయు జిల్లాలో ఆదివారం ఇటువంటి ఘటనే జరిగింది. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో విధించిన ఆంక్షలను ఉల్లంఘిస్తూ.. వేల సంఖ్యలో ప్రజలు ఓ మత గురువు అంతిమ యాత్రకు హాజరయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్​గా మారింది.

మత గురువు అంతిమ యాత్రలో ..

పోలీసుల వివరాల ప్రకారం..

మత గురువైన హజరత్​ మహమ్మద్​ సలీముల్​ కాదరీ ఆదివారం మృతి చెందారు. కాదరీ మరణ వార్త తెలిసి స్థానిక ప్రజలతో పాటు సమీప గ్రామాల్లోని వారు కూడా తరలివచ్చారు. ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా కాదరీ అంతిమయాత్రలో పాల్గొన్నారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు చేపడతామని వెల్లడించారు.

ఇదీ చదవండి :రైల్వే, కేంద్ర బలగాలపై కరోనా పంజా!

ABOUT THE AUTHOR

...view details