అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న వారందరూ రావణుని పార్టీ అని కేంద్రమంత్రి సదానందగౌడ విమర్శించారు. రామాయణంలో ఉండే కుంభకర్ణుని పాత్రను ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పోషిస్తోందని దుయ్యబట్టారు. పలు దఫాలుగా దేశాన్ని పరిపాలించిన హస్తం పార్టీతో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. భాజపా చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్ని చూసి ఇకనైనా.. విభీషణుడిలా తమకు సహకరించాలని కోరారు.
అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తమ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందని అన్నారు. ఈ సమయంలో విపక్షాలు కొర్రీలు పెట్టడం ఆపి.. రాముని ఆశీర్వాదం కోసం అందరూ కలిసి రావాలన్నారు. ఆర్ఎస్ఎస్ అనేది అతిపెద్ద ఆర్గనైజేషన్ అని చెప్పిన కేంద్రమంత్రి.. దేశాభివృద్ధికి గొప్ప నాయకత్వాన్ని అందించిందని గుర్తుచేశారు.
రాజకీయ లబ్ధి కోసమే: సిద్ధరామయ్య