దాదాపు ఏడాదికిపైగా రైతు ఉద్యమం (Farmers movement) నిరాటంకంగా సాగడానికి కొందరు రైతు నాయకులు (Farmer leaders in India) ఎంతగానో పోరాటం చేశారు. అన్నదాతల్లో ఎప్పటికప్పుడు ఉత్సాహం నింపుతూ.. వారిని ముందుండి నడిపించారు. అందులో మొదట చెప్పుకోవాల్సింది భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధికార ప్రతినిధి రాకేశ్ టికాయిత్ (Rakesh tikait news). ఈయనే కాక మరికొంత మంది సాగు చట్టాలపై తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేశారు.
1. రాకేశ్ టికాయిత్
ఈయన భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధికార ప్రతినిధి (Bharatiya Kisan Union). తాజా పోరాటంలో అన్నీతానై వ్యవహరించారు. సహచరులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేశారు. ఉద్యమం దీర్ఘకాలం సాగుతుండటంతో అన్నదాతలు నీరుగారిపోకుండా తన ప్రసంగాలతో ఎప్పటికప్పుడు (Farmers protest reason 2020) వారిలో ఉత్సాహం నింపారు. పలు సందర్భాల్లో ఈయన కన్నీరు పెట్టుకోవడం చూసి రైతు కుటుంబాలు చలించిపోయాయి. ఆయన పిలుపునకు స్పందించి పోరాటంలో పాల్గొనేందుకు ఉత్సాహంతో ముందుకువచ్చాయి. ప్రభుత్వంతో చర్చల్లో టికాయిత్ కీలక పాత్ర పోషించారు. ఒకప్పుడు ఈయన దిల్లీలో పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేశారు.
2. దర్శన్ పాల్
అఖిల భారత కిసాన్ సంఘర్ష్ సమన్వయ కమిటీ కార్యనిర్వాహక బృందంలో సభ్యుడు. వృత్తిరీత్యా వైద్యుడు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుసంఘాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. 70 ఏళ్ల వయసులోనూ.. కేంద్ర ప్రభుత్వంతో చర్చల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాలకు ఉద్యమాన్ని(Farmers movement) విస్తరింపజేయడంలో ప్రధాన భూమిక పోషించారు.
3. జోగిందర్‌సింగ్ ఉగ్రాహాన్
భారతీయ కిసాన్ యూనియన్ (ఉగ్రాహాన్) అధ్యక్షుడు. గతంలో సైన్యంలో సేవలందించారు. ఈయన నేతృత్వంలోని బృందం పంజాబ్‌లో దూకుడుగా నిరసనలు చేపట్టింది. రైల్ రోకో, భాజపా నేతల ఘెరావ్ వంటి ఆందోళనలతో (Farmers protest latest news) అందరి దృష్టినీ ఆకర్షించారు. ఎక్కువ శాతం రైతుసంఘాలు సింఘు సరిహద్దులో నిరసనలు చేపట్టగా.. జోగిందర్ బృందం టిక్రి సరిహద్దులో ఆందోళనల బాధ్యతను అన్నీతానై చూసుకుంది.
4. బల్బీర్‌సింగ్ రాజేవాల్
భారతీయ కిసాన్ యూనియన్ (రాజేవాల్) అధ్యక్షుడు. వయసు 78 ఏళ్లు. రైతు సంఘాలు (Indian farmers' protest leaders) ఉమ్మడిగా నిరసనల ప్రణాళికలు రచించడంలో, వాటిని అమల్లో పెట్టడంలో కీలక పాత్ర పోషించారు. రైతు డిమాండ్ల పత్రానికి రూపకల్పన చేయడంలో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించారు. చట్టాలపై రైతుల అభిప్రాయమేంటో.. చర్చల సమయంలో ప్రభుత్వానికి నిక్కచ్చిగా వివరించారు.