తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అలాంటి వారికి ఈ సమాజంలో స్థానం లేదు' - పరువు హత్యపై అలహాబాద్​ హైకోర్ట్​ సీరియస్​

పరువు హత్యకు పాల్పడిన ఓ వ్యక్తి బెయిల్​ పిటిషన్​ను అలహాబాద్​ హైకోర్టు కొట్టివేసింది. ఇలాంటి హత్యలకు పాల్పడిన వారికి ఈ సమాజంలో స్థానం లేదని తీవ్రంగా వ్యాఖ్యానించింది.

Allahabad HC
అలహాబాద్​ హైకోర్టు

By

Published : Jul 7, 2021, 12:49 PM IST

పరువు హత్య కేసులో బెయిల్ పిటిషన్​ దాఖలు చేసిన గుల్​షన్​ అనే వ్యక్తిపై అలహాబాద్​ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కుటుంబ గౌరవం పేరుతో.. సోదరిని, ఆమె భర్తను హత్య చేయడంపై మండిపడింది. 'కుటుంబ గౌరవం పేరుతో తప్పుడు ఆలోచనతో హత్యలకు పాల్పడే వారికి ఈ సమాజంలో స్థానం లేద'ని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు విన్న జస్టిస్​ జేజే మునిర్​ నేతృత్వంలోని ధర్మాసన ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.

"గుల్​షన్​ మాత్రమే కాకుండా, కుటుంబ సభ్యులు అందరూ పరువు హత్యలో భాగం అయ్యారు అని స్పష్టం అవుతోంది. ఈ కేసులో ఆ కుటుంబం అహంకారం స్పష్టంగా కనిపిస్తోంది. వీరి పరువుకు భంగం కలిగింది అని యువ జంటను దారుణంగా హత్య చేశారు. ఇందుకుగాను బెయిల్ మంజూరు చేయడం కుదరదు."

-అలహాబాద్​ హైకోర్టు

ఈ హత్య కేసులో గుల్​షన్​దే కీలక పాత్ర అని నమ్మిన న్యాయస్థానం అతనికి బెయిల్​ మంజూరు చేయడం కుదరదని స్పష్టం చేసింది. దీనికి గానూ గుల్​షన్​ తరుఫు న్యాయవాది వాదను వినిపించారు. కేవలం రోహిత్​ కుమార్​ అనే వ్యక్తిపై మాత్రమే దాడి చేశారని.. కాల్పులు జరిపింది మరో నిందితుడని కోర్టుకు విన్నవించారు.

గుల్​షన్​ సోదరి వేరే సామాజికి వర్గానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్న కారణంగా వారి కుటుంబం పగతో వారిని అంతం చేసింది.

ఇదీ చూడండి:రాజధానిలో మాజీ మంత్రి భార్య దారుణ హత్య

ABOUT THE AUTHOR

...view details