తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కోచింగ్​ సెంటర్​కు 'పెగాసస్​' పేరు- టీచర్లకు చుక్కలు! - కేరళ న్యూస్​

పెగాసస్​.. ఇప్పుడు భారత్​తో పాటు ప్రపంచ దేశాల్లో సంచలనంగా మారిన అంశం. రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు.. వివిధ రంగాల్లోని ప్రముఖలపై నిఘా విషయం దుమారం రేపుతోంది. కేరళలోని ఓ కోచింగ్​ సెంటర్​కు సైతం ఈ పెగాసస్​.. చిక్కులు తెచ్చిపెట్టింది. ఆన్​లైన్​ క్లాసుల కోసం తీసుకొచ్చిన ఓ యాప్..​ వారికి తలనొప్పిగా మారింది. పెగాసస్​తో వాళ్లు ఎదుర్కొన్న సమస్య ఏమిటి?

'pegasus application
కోచింగ్​ సెంటర్​

By

Published : Jul 26, 2021, 4:15 PM IST

ప్రశ్న: 'సార్.. మీ యాప్​ డౌన్​లోడ్​ చేసుకున్నాం. ఈ యాప్​తో ఫోన్​ కాల్స్​ను ట్యాప్​ చేయటం ఎలాగో చెప్పండి?'

జవాబు: మీరు అనుకున్నటువంటి యాప్​ కాదు. ఇది కేరళలోని పీఎస్​సీ కోచింగ్​ సెంటర్​కు చెందినది. కేవలం చదువుకు సంబంధించినవే మీరు తెలుసుకోగలరు.

ప్రశ్న: లేదు సర్​. మీ యాప్​ పేరు పెగాసస్​ కదా?

జవాబు. అవును

ప్రశ్న: అయితే.. మీరు ఫోన్​ కాల్స్​ను ఎందుకు లీక్​ చేయలేకపోతున్నారు?

ఈ సంభాషణ.. ఓ కోచింగ్​ సెంటర్​ సిబ్బంది, కాలర్​ మధ్య జరిగినది. మా యాప్​ అలాంటిది కాదు బాబోయ్​ అని మొత్తుకున్నా.. రోజుకు రెండో మూడో ఇలాంటి కాల్స్​ వస్తూనే ఉన్నాయంటున్నారు నిర్వాహకులు. అంతటికీ కారణం.. వారి యాప్​ పేరు 'పెగాసస్​' కావటమే!

ఫోన్​లో ఇన్​స్టాల్​ అయిన పెగాసస్​ యాప్​

కేరళ, కోజికోడ్​లోని కోయిలాండి ప్రాంతంలో 'పెగాసస్​' అనే పేరుతో పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ కోచింగ్​ సెంటర్​ ఉంది. కరోనా కారణంగా గత ఏడాది లాక్​డౌన్​ విధించిన క్రమంలో మూతబడింది. అయితే.. విద్యార్థులకు ఆన్​లైన్​ క్లాసులు నిర్వహించాలని 'యాప్​'ను అందుబాటులోకి తెచ్చారు నిర్వాహకులు పీసీ సనూప్​, ఆయన స్నేహితుడు అబిన్​. గూగుల్​ ప్లే స్టోర్​లో ఈ యాప్​ అందుబాటులో ఉంది. దీనిని డౌన్​లోడ్​ చేసుకుని ఆన్​లైన్​ క్లాసులు వినొచ్చు.

పెగాసస్​ యాప్​లో ఆన్​లైన్​ క్లాసులు

ఇటీవల ఈ యాప్​ డౌన్​లోడ్​లు రెండితలయ్యాయి. అలాగే.. కోచింగ్​ సెంటర్​కు కాల్స్​ పెరిగాయి. "యాప్​ డౌన్​లోడ్​ చేసుకున్నాం. ఫోన్​ కాల్స్​ ట్యాప్​ చేయటం ఎలాగో చెప్పండి?" అనే ప్రశ్న అక్కడి సిబ్బందిని ఇబ్బందులకు గురి చేస్తోంది.

పీసీ సనూప్​, కోచింగ్​ సెంటర్​ నిర్వాహకుడు

" కొవిడ్​ కారణంగా లాక్​డౌన్​ విధించటం వల్ల 2020, జూన్​ నుంచి ఆఫ్​లైన్​ క్లాసులు జరగటం లేదు. అప్పటి నుంచి ఆన్​లైన్​ క్లాసులు చేపడుతున్నాం. పెగాసస్​ ఆన్​లైన్​ పేరుతో యాప్​ తీసుకొచ్చాం. ప్రస్తుతం పెగాసస్​ స్పైవేర్​ అంశం వెలుగులోకి వచ్చింది. అంతకు ముందు మా యాప్​ వెయ్యి డౌన్​లోడ్స్​ ఉండేవి.పెగాసస్​ విషయం తెలిశాక మరో 1200 డౌన్​లోడ్స్​ అదనంగా పెరిగాయి. మొత్తం 2200కు చేరింది. ఎక్కువగా ఉత్తర భారతం నుంచి ఫోన్​ కాల్స్​ వచ్చాయి."

- పీసీ సనూప్​, కోచింగ్​ సెంటర్​ నిర్వాహకుడు.

రోజురోజుకు అలాంటి ఫోన్​ కాల్స్​ పెరగటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెబుతున్నారు కోచింగ్​ సెంటర్​ సిబ్బంది. చాలా వరకు ఉత్తర భారతం నుంచి కాల్స్​ వస్తున్నట్లు తెలిపారు. వారికి కావాల్సింది కేవలం ఫొన్​ కాల్స్​ లీక్​ చేయటమేనని పేర్కొనటం గమనార్హం.

ఇదీ చూడండి:'పెగాసస్' పెనుభూతం.. మీ ఫోనూ హ్యాక్ కావచ్చు!

ABOUT THE AUTHOR

...view details