తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మోదీ హయాంలో వారి సంపదే వృద్ధి'

ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో నిరుద్యోగం, ధరలు, పేదరికం బాగా పెరిగాయని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ విమర్శించారు. ప్రభుత్వ పెద్దల స్నేహితుల ఆస్తులు అమాంతం పెరిగాయని ఆరోపించారు.

This govt has only increased unemployment, inflation and poverty: Rahul Gandhi
'మోదీ హయాంలో నిరుద్యోగం, ధరలు, పేదరికం పెరిగాయి'

By

Published : Mar 20, 2021, 2:47 PM IST

ఎన్​డీఎ సర్కార్‌ హయాంలో నిరుద్యోగం, ధరలు, పేదరికంతో పాటు ప్రభుత్వ పెద్దల స్నేహితుల సంపద పెరిగిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ట్విట్టర్‌లో ఈ మేరకు కేంద్రంపై ఆయన విమర్శలు గుప్పించారు.

కొవిడ్‌-19 విజృంభణకు ముందు దేశంలో 9.9 కోట్లుగా ఉన్న మధ్యతరగతి ప్రజలు మరింత దిగజారి పేదరకంలోకి వెళ్లారని రాహుల్ అన్నారు. ప్రస్తుతం మధ్యతరగతి ప్రజల సంఖ్య 6.6 కోట్లకు చేరిందని తెలిపే మీడియా నివేదికను ఆధారంగా చూపారు.

ఇదీ చూడండి: ఆర్​ఎస్​ఎస్​ జనరల్ సెక్రటరీగా 'హోసబలే'

ABOUT THE AUTHOR

...view details