విదేశీయుల నుంచి అక్రమంగా నిధులు కొల్లగొట్టిన స్కామ్లో 34 మందిని దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు.. అమెరికా డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్, యాపిల్ టెక్నికల్ అసిస్టెంట్, మెక్ఎఫీ యాంటీవైరస్ సపోర్ట్ సిబ్బంది నుంచి ఫోన్ చేస్తున్నట్లు నటించి.. బాధితులను బురిడీ కొట్టించేవారని పోలీసులు తెలిపారు.
కీలక నిందితులైన క్షితిజ్ బాలి, అభిషేక్, ధనంజయ్ నేగిలు అక్రమంగా రెండు కాల్ సెంటర్లను నడిపిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. ఉత్తరమ్నగర్లోని ఓ భవనంలో వీరు తమ కార్యకలాపాలు కొనసాగించారని చెప్పారు.