జేఈఈ మెయిన్స్ మార్చి విడత పరీక్ష ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. 13 మంది అభ్యర్థులు.. 100 పర్సంటైల్ సాధించారని తెలిపింది. వారిలో తెలంగాణ నుంచి బన్నూరు రోహిత్ కుమార్ రెడ్డి, మదుర్ ఆదర్శ్ రెడ్డి, జోస్యుల వెంకట ఆదిత్య ఉన్నారు.
జేఈఈ మెయిన్స్: తెలంగాణలో ముగ్గురికి 100 పర్సంటైల్ - జేఈఈ ఫలితాలు
జేఈఈ మెయిన్స్ మార్చి విడత పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. 13 మంది అభ్యర్థులు 100 పర్సంటైల్ సాధించారు. వారిలో ముగ్గురు తెలంగాణ అభ్యర్థులు ఉన్నారు.
జేఈఈ మెయిన్స్ ఫలితాలు: 13 మందికి 100%
దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ రెండో విడత ఆన్లైన్ పరీక్షలు మార్చి 16 నుంచి మార్చి 18 వరకు జరిగాయి. 6,19,368 మంది అభ్యర్థులు.. పరీక్షకు హాజరయ్యారు. విదేశాల్లోని 12 నగరాలు సహా మొత్తం 334 నగరాల్లోని 792 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగాయి.
ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే సెషన్స్‌లో జేఈఈ పరీక్షలు జరిగిన తర్వాత.. వాటిల్లో బెస్ట్ ఆఫ్ ఫోర్‌ను పరిగణనలోకి తీసుకుంటామని ఓ అధికారి తెలిపారు.
Last Updated : Mar 25, 2021, 2:47 AM IST