తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కరోనా మూడోదశ అనివార్యం- ఎదుర్కొనేందుకు సిద్ధం!'

దేశంలో కరోనా మూడోదశ విజృంభణ అనివార్యమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ దశను ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నట్లు తెలిపింది. ఈ థర్డ్‌ వేవ్‌ ఎప్పుడు సంభవిస్తుందనే విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పలేమని పేర్కొంది.

Third wave of COVID
కరోనా మూడో దశ

By

Published : May 5, 2021, 7:17 PM IST

ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల పెరుగుదల చూస్తుంటే.. మూడోదశ అనివార్యమని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. అయితే ఎప్పుడొస్తుందో స్పష్టంగా చెప్పలేమని తెలిపింది. ఈ దశను ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారు కే విజయరాఘవన్ స్పష్టం చేశారు. కరోనా రెండోదశ ఎప్పుడు నియంత్రణలోకి వస్తుందో చెప్పలేమన్నారు. వైరస్​లో ఏర్పడే మార్పులను ముందుగానే అంచనావేసి.. వాటికి అనుగుణంగా వ్యాక్సిన్లను ఎప్పటికప్పుడు అప్​డేట్​ చేసుకోవడం ఎంతో అవసరమన్నారు.

కరోనా కేసులపై ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాలు..

  • మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, యూపీ ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాల్లో 1.5 లక్షల చొప్పున యాక్టివ్​కేసులు ఉండగా.. 12 రాష్ట్రాల్లో 50 వేల నుంచి లక్ష మధ్య.. మరో 17 రాష్ట్రాల్లో 50 వేల కంటే తక్కువ క్రియాశీలక కేసులున్నాయి.
  • కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్​, బంగాల్​, తమిళనాడు, బిహార్​ రాష్ట్రాల్లో రోజువారీగా నమోదవుతున్న కేసుల సంఖ్య పెరుగుతుంది.
  • మూడోదశ వ్యాక్సినేషన్​లో భాగంగా మే 1 తేదీ నుంచి తొమ్మిది రాష్ట్రాల్లో 6.71 లక్షల మంది 18-44 మధ్య వయస్కులకు టీకా అందింది.
  • రోజురోజుకూ 2.4 శాతం కొత్త కేసులు పెరుగుతున్నాయి.
  • మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్​, దిల్లీ, హరియాణా రాష్ట్రాల్లో కరోనా మరణాలు పెరుగుతున్నాయి.

లాక్​డౌన్​ మాత్రమే పరిష్కారమా?

వైరస్​ వ్యాప్తి నియంత్రణకు దేశవ్యాప్త లాక్​డౌన్​ మాత్రమే పరిష్కారమా? అనే ప్రశ్నకు.. "కొవిడ్​ కట్టడిపై రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీ చేశాం. అంతకుమించి ఏదైనా అవసరమనిపిస్తే దాని గురించి చర్చిస్తాం" అని బదులిచ్చారు నీతి ఆయోగ్​ సభ్యులు డాక్టర్​ వీకే పాల్​. అలాగే వైరస్​ జంతువుల నుంచి సోకడం లేదని.. మనుషుల నుంచి మనుషులకే వ్యాపిస్తోందని చెప్పారు. పరివర్తన చెందిన వైరస్​లను.. మాస్క్​ ధరించడం, భౌతిక దూరం, చేతులు శుభ్రం చేసుకోవడం ద్వారా ఎదుర్కోవచ్చన్నారు.

ఇదీ చూడండి:మాస్క్​ ఉల్లం'ఘనుల' నుంచి రూ. 54 కోట్ల వసూలు

ABOUT THE AUTHOR

...view details