కర్ణాటక చామరాజ్నగర్ జిల్లా అడవుల్లో దొరికిన నాలుగు పులిపిల్లల్లో మూడు.. ఆకలి కారణంగా చనిపోయినట్లు అధికారులు తెలిపారు. రెండు పిల్లలు అటవీ ప్రాంతంలోనే మరణించగా.. మరోకటి చికిత్స పొందుతూ మైసూర్ జూలో ప్రాణం వీడింది.
ఆకలితో మూడు పులి పిల్లలు మృతి - చామరాజ్ నగర్లో పులిపిల్లలు మృతి
కర్ణాటక చామరాజ్నగర్ అడవుల్లో దొరికిన నాలుగు పులి పిల్లల్లో మూడు చనిపోయాయి. వాటి మరణానికి ఆకలి కారణమని తెలుస్తోంది.
![ఆకలితో మూడు పులి పిల్లలు మృతి Third tiger cub dies of starvation in Karnataka](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11214233-942-11214233-1617105105426.jpg)
ఆకలితో మూడు పులి పిల్లలు మృతి
నాలుగోది మగ పులి పిల్ల అని ఆధికారులు తెలిపారు. ప్రస్తుతం దీనికి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పులి పిల్లలు దొరికిన ప్రాంతం నుంచి పాదముద్రల సాయంతో తల్లి పులి కోసం అటవీ సిబ్బంది అన్వేషణ కొనసాగిస్తున్నారు.
ఇదీ చూడండి:బిహార్లో ఘోరం- ఆరుగురు చిన్నారులు సజీవదహనం