తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జేఈఈ మెయిన్స్​ కొత్త తేదీలివే.. - జేఈఈ మెయిన్స్​ పరీక్షల ఫలితాలు

JEE-Mains
జేఈఈ మెయిన్స్

By

Published : Jul 6, 2021, 7:34 PM IST

Updated : Jul 6, 2021, 8:41 PM IST

19:29 July 06

జేఈఈ మెయిన్స్​ కొత్త తేదీలివే..

ఇంజినీరింగ్​లో ప్రవేశం కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్షలకు సంబంధించి..​ కొత్త తేదీలను విడుదల చేసింది కేంద్ర విద్యాశాఖ. జులై 20- 25 వరకు మూడో​ ఎడిషన్, జులై 27- ఆగస్టు 2 మధ్య నాలుగో ఎడిషన్ నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ మంగళవారం ప్రకటించారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కొవిడ్ నిబంధనలను పాటిస్తూ పరీక్షలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. గతంలో నిర్వహించిన పరీక్షల ఫలితాలను ఆగస్టులో ప్రకటించే అవకాశం ఉందన్నారు.

ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి నాలుగు సార్లు పరీక్షను నిర్వహించనున్నట్లు పోఖ్రియాల్ వెల్లడించారు. దీనివల్ల విద్యార్థులు తమ ర్యాంకులను మెరుగుపర్చుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు. 

ఫిబ్రవరిలో ప్రిలిమ్స్, మార్చిలో మెయిన్స్ రెండో దశ జరగాల్సిఉండగా.. తదుపరి ఎడిషన్లు ఏప్రిల్, మే నెలల్లో జరగాల్సి ఉంది. జులై 3న జరగాల్సిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష సైతం వాయిదా పడింది.  

దేశవ్యాప్తంగా ఐఐటీల్లో(ఇంజనీరింగ్) ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షకు తీవ్ర పోటీ ఉంటుంది.

Last Updated : Jul 6, 2021, 8:41 PM IST

ABOUT THE AUTHOR

...view details