తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ట్రాన్స్​ఫార్మర్​లోని రాగి వైర్లను ఎత్తుకెళ్లిన దొంగలు.. రోజంతా కరెంట్ కట్ - Electricity cut off due to thieves

ట్రాన్స్​ఫార్మర్​లోని రాగి వైర్లను ఎత్తుకెళ్లారు దొంగలు. ఉత్తర్​ప్రదేశ్​లో ఈ ఘటన జరిగింది. దీంతో గ్రామంలో రోజంతా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గాజియాబాద్​ జిల్లాలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది.

Wires in transformer stolen in Uttar Pradesh
రాగి వైర్లు చోరి చేసిన ట్రాన్స్​ఫార్మర్

By

Published : Dec 28, 2022, 11:00 PM IST

దొంగలు చేసిన పనికి ఉత్తర్​ప్రదేశ్​లోని ఓ గ్రామం మొత్తం రోజంతా అంధకారంలోకి వెళ్లింది. ట్రాన్స్​ఫార్మర్​ను విప్పదీసి అందు​లోని రాగి వైర్లను ఎత్తుకెళ్లారు గుర్తు తెలియని దొంగలు. సోమవారం రాత్రి దొంగలు ఈ ఘటనకు పాల్పడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాజియాబాద్​లో జిల్లాలో ఈ ఘటన జరిగింది. రాత్రిపూట దొంగలు ట్రాన్స్​ఫార్మర్​ను విప్పదీసి అందులోని రాగి వైర్లను ఎత్తుకెళ్లారు. దీంతో ఘటన జరిగినప్పటి నుంచి మంగళవారం వరకు గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఘటన జరిగిన సమయంలో పెద్ద ఎత్తున పొగ రావడం వల్ల.. స్థానికులు దొంగలను గుర్తించలేకపోయారు.

ట్రాన్స్​ఫార్మర్​లో రాగి వైర్లు చోరీ చేసిన దొంగలు
వైర్లు లేని ట్రాన్స్​ఫార్మర్

విప్పదీసిన ట్రాన్సఫార్మర్​ను స్వాధీనం చేసుకున్న గ్రామస్థులు.. అందులో రాగి వైర్లు చోరికి గురైనట్లు గుర్తించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా విద్యుత్తు శాఖ కొత్త ట్రాన్స్​ఫార్మర్​ను ఏర్పాటు చేసి, కరెంట్​ సరఫరాను పునరుద్ధరించింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం విచారణ జరుపుతున్నట్లు వారు వెల్లడించారు. నిందితులను సాధ్యమైనంత త్వరగా పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.

.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details