బిహార్‌లోని మోతిహరి జిల్లాలో ఓ చికెన్ షాపులో దొంగలు బీభత్సం సృష్టించారు. దుకాణం తాళాలు పగలగొట్టి 55 కోళ్లను ఎత్తుకెళ్లారు. జనవరి 2న రాత్రి ఈ ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..పటాహి పోలీస్ స్టేషన్ పరిధిలోని బక్రీ బజార్లో దొంగలు ఈ చోరీకి పాల్పడ్డారు. మొహమ్మద్ ఇజ్రాయెల్‌కు చెందిన చికెన్ షాపులో గుర్తుతెలియని వ్యక్తులు 55 కోళ్లను చోరీ చేశారు. వాటి విలువ దాదాపు రూ.55వేల వరకు ఉంటుంది. దొంగలు టెంపోలో వచ్చి చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
తాళాలు పగలగొట్టి మాంసం దుకాణంలో చోరీ.. 55 కోళ్లు మాయం.. - 150 కిలోల చికెన్‌ను చోరిక చేసిన దొంగలు
చికెన్ షాపులో 55 కోళ్లను దొంగలు ఎత్తుకెళ్లారు. వాటి విలువ రూ.55 వేలకుపైగా ఉంటుందని యజమాని తెలిపాడు. బిహార్ జరిగిందీ ఘటన.
బిహార్‌లో కోళ్లను ఎత్తుకెళ్లిన దొంగలు
"కొత్త సంవత్సరంలో గిరాకీ బాగా ఉంటుందని చాలా కోళ్లు కొనుక్కొని వచ్చాను. వాటన్నింటిని దొంగలు ఎత్తుకెళ్లారు. జనవరి 2న దుకాణానికి తాళం వేసి ఇంటికెళ్లాను. ఉదయాన్నే వచ్చి చూసే సరికి కోళ్లు లేవు. తాళం మాత్రం పగులగొట్టి ఉంది. అంతకు ముందు 2021 డిసెంబర్ 26న నా షాపులో చోరీ జరిగింది. అప్పుడు రూ.10వేల విలువగల గుడ్లను దొంగలు ఎత్తుకెళ్లారు." అని బాధితుడు తెలిపాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల కోసం వెతుకున్నట్లు వారు వెల్లడించారు.