తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అధికార పార్టీ ఎంపీ ఇంట్లో దొంగతనం- వీఐపీలంతా ఆ కాలనీలోనే.. - అంబికాపూర్​లో దొంగతనం

Thieves in bjp mp residence: సామాన్యుల ఇళ్లలో దొంగలు పడి దోచుకోవడం సాధారణమే. అయితే పటిష్టమైన భద్రత మధ్య ఉన్న ఓ రాజ్యసభ ఎంపీ ఇంట్లో తమ చేతి వాటాన్ని ప్రదర్శించారు దొంగలు. అందినకాడికి ఎత్తుకెళ్లారు.

ramvichar netam
భాజపా ఎంపీ రాంవిచార్ నేతమ్

By

Published : Mar 21, 2022, 12:32 PM IST

Updated : Mar 21, 2022, 12:46 PM IST

Thieves in bjp mp residence: ఏకంగా ఎంపీ ఇంట్లోనే చొరబడి నగదు, ఆభరణాలను కొల్లగొట్టుకెళ్లారు దొంగలు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌​​లోని అంబికాపూర్​లో జరిగింది. రూ.లక్ష నగదుతో పాటు విలువై ఆభరణాలు అపహరణకు గురయ్యాయి.

ఎంపీ ఇంట్లో చిందరవందరగా పడి ఉన్న వస్తువులు

వీఐపీల ప్రాంతంలో దొంగతనం..

భాజపా రాజ్యసభ ఎంపీ రాంవిచార్ నేతమ్ అధికారిక నివాసంలో ఈ దొంగతనం జరిగింది. పోలీసు కమిషనర్, మెజిస్ట్రేట్​లు వంటి ప్రభుత్వ ముఖ్య అధికారులు అంబికాపూర్​లోనే నివసిస్తున్నారు. వీఐవీలు నివసించే ప్రాంతం కావడం వల్ల పోలీసులు నిత్యం గస్తీ కాస్తుంటారు. వీఐపీలు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో దొంగతనం జరగడం వల్ల పోలీసులకు తలనొప్పిగా మారింది. దీనిపై గాంధీనగర్​ పోలీసులు కేసు నమోదు చేసుకుని.. నిందితుల కోసం గాలిస్తున్నారు. దర్యాప్తులో భాగాంగా గార్డ్స్​ను కూడా ప్రశ్నిస్తున్నారు పోలీసులు.

బీరువా తలుపులు బద్దలుకొట్టిన దొంగలు

ఇదీ చదవండి:నటుడు సురేశ్​గోపీ సోదరుడు అరెస్ట్​..!

Last Updated : Mar 21, 2022, 12:46 PM IST

ABOUT THE AUTHOR

...view details