తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆస్పత్రి ఆక్సిజన్​ పైప్​లైన్​ కట్​ చేసిన దొంగలు.. 20 మంది నవజాతి శిశువులు...

ఆస్పత్రి వెనుక ఉన్న ఆక్సిజన్​ ప్లాంట్​ పైపులైన్​ను దొంగలు కట్​ చేశారు. దీంతో 20 మంది నవజాత శిశువులకు ఆక్సిజన్​ సరఫరా నిలిచిపోయింది. హుటాహుటిన స్పందించిన ఆస్పత్రి సిబ్బంది.. సిలిండర్ల ద్వారా ఆక్సిజన్​ అందించారు. రాజస్థాన్​లో జరిగిందీ ఘటన.

thieves-cut-oxygen-pipeline-in-rajasthan-alwar-geetanand-shishu-hospital
thieves-cut-oxygen-pipeline-in-rajasthan-alwar-geetanand-shishu-hospital

By

Published : Feb 6, 2023, 10:30 AM IST

రాజస్థాన్​లో పెను ప్రమాదం తప్పింది. ఓ ఆస్పత్రి వెనుక ఉన్న ఆక్సిజన్​ ప్లాంట్​ పైపులైన్​ను దొంగలు కట్​ చేశారు. దీంతో ఆక్సిజన్​ సరఫరా ఆగిపోయింది. వెంటనే వార్డులో ఉన్న 20 మంది నవజాత శిశువులకు సిలిండర్ల ద్వారా ఆక్సిజన్​ను​ అందించారు ఆస్పత్రి సిబ్బంది. ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇదీ జరిగింది.. అల్వార్​ నగరంలోని గీతానంద్​ శిశు ఆస్పత్రిలో ఎఫ్​బీఎన్​సీ వార్డులో 20 మంది నవజాత శిశువులు.. ఆక్సిజన్​ సపోర్ట్​ మీద ఉన్నారు. అయితే ఆదివారం రాత్రి.. ఆస్పత్రి వెనుక ఉన్న ఆక్సిజన్​ ప్లాంట్​ పైపులను దొంగలించేందుకు కొందరు గుర్తుతెలియని వ్యక్తులు యత్నించారు. అందులో భాగంగా ఆక్సిజన్ పైపులను కట్​ చేశారు. దీంతో ఎఫ్​బీఎన్​సీ వార్డుకు ఆక్సిజన్​ సరఫరా ఆగిపోవడం వల్ల ఆస్పత్రిలో కలకలం రేగింది. అది గమనించిన దొంగలు.. పరారయ్యారు. దొంగలను చూసిన ఆస్పత్రి గార్డు గట్టిగా అరిచాడు. చిన్నారుల కుటుంబసభ్యులు, స్థానికులు.. పరిగెత్తి దొంగలను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

దొంగలు కట్​ చేసిన ఆక్సిజన్ పైపు లైన్​

వార్డులో ఉన్న చిన్నారులకు అత్యవసరంగా ఆక్సిజన్​ అందించేందుకు ఆస్పత్రి సిబ్బంది చర్యలు తీసుకున్నారు. హాస్పిటల్​ ఆవరణలో ఉన్న ఆక్సిజన్​ నింపి ఉన్న సిలిండర్లను ఎఫ్​బీఎస్​సీ వార్డుకు తరలించారు. హుటాహుటిన నవజాత శిశువులకు ఆక్సిజన్​ అందించారు. ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ఘటనపై ఆసుపత్రి సిబ్బంది.. అధికారులకు సమచారం అందించారు. దీంతో అధికారులు.. ఇంజినీర్లను పిలిపించి రాత్రికి రాత్రే పైపులైన్‌కు మరమ్మతులు చేయించారు. ఆక్సిజన్​ సరఫరా సాఫీగా సాగేటట్లు చర్యలు చేపట్టారు.

అయితే ఈ ఆస్పత్రిలో గతంలో అనేక సార్లు దొంగతనాలు జరిగాయని సిబ్బంది తెలిపారు. విద్యుత్​ వైర్లు, పైపులైన్లు, మోటర్లు, ఇతర వస్తువులను దొంగలు దోచుకెళ్లారని చెప్పారు. పోలీసులు మాత్రం పట్టించుకోవడంలేదని, ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఆదివారం రాత్రి జరిగిన ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇద్దరు దొంగలను స్టేషన్​కు తరలించి విచారిస్తున్నారు. వారికి సహకరించిన వ్యక్తులను కూడా పట్టుకునేందుకు గాలింపు చర్యలు ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details