తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చోరీ చేసిన బంగారాన్ని తిరిగి పార్సిల్​లో​ పంపించిన దొంగ! - ఘాజియాబాద్​ లేటెస్ట్​ న్యూస్​

ఆ ఇంట్లో చోరీ జరిగి నాలుగు రోజులైంది. దర్యాప్తు జరుగుతుండగానే ఓ పార్సిల్​లో చోరికి గురైన వస్తువులు కొన్ని తిరిగి వచ్చాయి. ఘాజియాబాద్​లో జరిగిన ఈ ఘటన గురించి తెలుసుకోవాల్సిందే.

thief-sent-jewelry-back-to-victim-family-by-courier-in-ghaziabad
thief-sent-jewelry-back-to-victim-family-by-courier-in-ghaziabad

By

Published : Nov 2, 2022, 11:30 AM IST

చోరీకి పాల్పడ్డ దొంగలు ఎక్కడైనా ఆ సామాన్లను తిరిగి ఇచ్చేయడం చూశారా? అయితే మీరు తప్పక ఈ దొంగతనం గురించి తెలుసుకోవాల్సిందే. ఉత్తర్​ప్రదేశ్​ ఘాజియాబాద్​లోని ఓ ఇంట్లో నాలుగు రోజుల క్రితం చోరీ చేసిన దొంగ.. తిరిగి ఆ ఇంటికే వస్తువులను పార్సిల్​ పంపించాడు.

ఇదీ జరిగింది..
ఘాజియాబాద్​లోని రాజానగర్​ ఎక్స్‌టెన్షన్ పరిధిలో ఓ టీచర్​ నివాసముంటున్నారు. అయితే పని మీద కొద్ది రోజుల క్రితం వేరే ప్రాంతానికి వెళ్లారు. ఇదే అదునుగా చూసుకుని ఆ ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలతో పాటు కొన్ని సామాన్లను దొంగలు కాజేశారు. అక్టోబర్​ 27న తిరిగి వచ్చి చూస్తే.. ఇల్లంతా చెల్లాచెదురుగా కనిపించింది. దీంతో షాక్​కు గురైన టీచర్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆ సొసైటీలోని సీసీటీవీ ఫుటేజ్​ను పరిశీలించారు. అందులో దొంగ ఆ ఇంటికి వచ్చి వెళ్లే దృశ్యాలు రికార్డయ్యాయి.

సీసీటీవీలో రికార్డయిన దొంగ ఫొటో

ఇంతలోనే ఆ ఇంటికి ఓ పార్సిల్​ రావడం కలకలం రేపింది. అందులో ఏముందోనని భయపడిన టీచర్​ కుటుంబం.. ఆ పార్సిల్​ను పోలీసులకు అప్పజెప్పింది. పార్సిల్​ ఓపెన్​ చేసి చూస్తే అందులో దొంగతనానికి గురైన కొన్ని ఆభరణాలు ఉన్నాయి. ఆ దొంగ నిజాయితీగా వస్తువులను తిరిగి పంపించాడని కొందరు అంటుంటే.. ఇది కచ్చితంగా ఏదో కుట్రలో భాగమని మరికొందరు అనుమానిస్తున్నారు. అంతే కాకుండా ఆ పార్సిల్​పై ఉన్న అడ్రస్​ కూడా ఫేక్​ అని పోలీసుల విచారణలో తేలింది.

పార్సిల్​లో వచ్చిన బంగారం

ఇదీ చదవండి:పుట్టిన రోజునే పిల్లలపై పెట్రోల్​ పోసి నిప్పంటించిన తండ్రి.. వైఫై పాస్​వర్డ్ కోసం బాలుడి హత్య

మత్తుమందు ఇచ్చి బాలికపై సామూహిక అత్యాచారం

ABOUT THE AUTHOR

...view details