తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చోరీకి వచ్చి ఇంట్లోని దేవుడి గదిలో ఉరేసుకున్న దొంగ.. నిజంగా ఆత్మహత్యేనా? - టెకీ ఇంట్లో దొంగ ఆత్మహత్య

ఓ టెకీ ఇంటిలోకి చోరీకి వెళ్లిన దొంగ.. అక్కడే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. అయితే దొంగ నిజంగానే ఆత్మహత్య చేసుకున్నాడా? లేదంటే దీని వెనక హత్య కోణం ఏదైనా ఉందా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

thief commits suicide
దొంగ ఆత్మహత్య

By

Published : Oct 25, 2022, 10:16 AM IST

దొంగతనానికి వచ్చే దొంగలు ఇంటిలోని డబ్బులు, నగలు, ఖరీదైన వస్తువులు ఎత్తికెళ్లిపోతుంటారు. అయితే కర్ణాటక బెంగళూరులోని ఓ ఇంట్లోకి దొంగతనానికి వచ్చిన ఓ దొంగ మాత్రం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై ఇందిరానగర్ పోలీస్ స్టేషన్‌లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదైంది. మృతుడు దిలీప్​ది హత్యా? ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దిలీప్ 2006లోనే ఓ దొంగతనం కేసులో అరెస్టయ్యాడని పోలీసులు తెలిపారు.

బెంగళూరులోని ఇందిరానగర్​లో నివాసం ఉంటున్న ఓ టెకీ కుటుంబం విదేశాలకు వెళ్లింది. ఈ క్రమంలోనే వారింట్లో దిలీప్ బహదూర్​ అనే దొంగ.. శుక్రవారం ఉదయం చొరబడ్డాడు. స్నానం చేసి.. ఇళ్లలో ఏవైనా విలువైన వస్తువులు ఉన్నాయా అని వెతికాడు. ఆ తర్వాత ఏమైందో తెలియదు గానీ టెకీ కుటుంబం విదేశాల నుంచి వచ్చేసరికి దొంగ దిలీప్.. దేవుడి గదిలో ఉరివేసుకుని కనిపించాడు. దీనిపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రంగంలోకి దిగిన పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేశారు.

ABOUT THE AUTHOR

...view details