బంగాల్లో భాజపా 200కుపైగా సీట్లు దక్కించుకుంటుందని జోస్యం చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. దక్షిణ 24 పరగణాల జిల్లా జయనగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన.. ఎక్కడైనా భాజపానే ఉందని అన్నారు. ఈ సందర్భంగా.. మమత సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతోనే.. ఆమె ఇతర పార్టీ నేతల మద్దతు, సాయం కోరుతున్నారని అన్నారు.
''కొన్నివారాల క్రితం భాజపా 200 కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తుందని బంగాల్ ప్రజలు చెప్పారు. భాజపా బలంగా తయారైంది. తొలిదశలో ఓటింగ్‌ను చూస్తేనే ఇది స్పష్టమైంది. బంగాల్లో భాజపా 200 కంటే ఎక్కువే గెలుస్తుంది.''
- నరేంద్ర మోదీ, ప్రధాని