తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు థర్డ్ ఫ్రంట్ ఏర్పడుతుందని అన్నారు మక్కల్ నీది మయ్యమ్ పార్టీ సారథి కమల్ హాసన్. తిరునెల్వేలిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్‌తో పొత్తు గురించి మాట్లాడేందుకు ఇది సరైన సమయం కాదని భావిస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చూడండి:రజనీతో పొత్తుకు 'ఫోన్‌కాల్' దూరంలో కమల్
''ఎంఎన్ఎం అధికారంలోకి వస్తే.. ఏర్పడి తమిళనాడును అవినీతి రహితంగా మారుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా థర్డ్ ఫ్రంట్ ఉంటుంది. మంచి సిద్ధాంతాలు ఉన్నవారితోనే ఎంఎన్ఎం జట్టుకడుతుంది. నేను రజనీ గురించి మాట్లాడుతున్నంత మాత్రాన ఆధ్యాత్మిక రాజకీయాల వైపు వెళ్తున్నట్లు కాదు. ఎంజీఆర్ వారసత్వాన్ని కొనసాగించే హక్కు నాకు ఉంది. ఆయన పార్టీలకతీతంగా మంచి నేత. ఇంకా నేను చిన్ననాటి నుంచి ఆయనకు సన్నిహితంగానే ఉన్నా.''