తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గిరిజనులలో లింగవివక్ష లేదు: రాష్ట్రపతి - జన్​జాతీయ సమ్మేళన్

గిరిజన ప్రజల నుంచి సాధారణ ప్రజానీకం నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ అన్నారు. వారిలో లింగ వివక్షత లేదన్నారు.

TRIBALS-LD PRESIDENT
'గిరిజనులలో లింగవివక్షత లేదు'

By

Published : Mar 7, 2021, 8:01 PM IST

గిరిజన తెగలలో లింగ వివక్షత లేదని రాష్ట్రపతి రామ్​నాథ్ ​కోవింద్​ అన్నారు. అందువల్ల సాధారణ ప్రజనీకానికంటే వారిలో లింగ నిష్పత్తి మెరుగ్గా ఉన్నట్లు పేర్కొన్నారు. గిరిజన తెగలనుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నారు. మధ్యప్రదేశ్​లో జరిగిన రాష్ట్రస్థాయి 'జన్​జాతీయ సమ్మేళన్'​(గిరిజన సమావేశం)లో ఆయన పాల్గొన్నారు. గిరిజనులకు విద్యావకాశాల్ని ఇంకా కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రకృతికి గిరిజన ప్రజలు చాలా ప్రాధాన్యం ఇస్తారని తెలిపారు. పోటీతత్వం కాకుండా సహకారానికి ఎక్కువ ప్రాముఖ్యం ఉంటుందన్నారు. మానవ విలువల్ని పెంపొందించుకోవాలంటే గిరిజనుల విలువలను పెంపొందించుకోవాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details