బంగాల్లో తృణమూల్‌కు మరో ప్రత్యామ్నాయం లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఇతర పార్టీలు తమ పార్టీ స్థానాన్ని భర్తీ చేయలేవని వ్యాఖ్యానించారు. తృణమూల్ ఎస్సీ, ఎస్టీ నేతలతో గురువారం జరిగిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్టానికి తృణమూల్ ప్రపంచంలోనే అత్యంత స్నేహపూర్వక పాలన అందించిందన్నారు.
దేశాన్ని అమ్మేశారు..
భాజపాపై దీదీ ధ్వజమెత్తారు. బంగారు భారత్‌ను నాశనం చేసిన భాజపా ఇప్పుడు బంగారు బంగాల్‌ను తీర్చిదిద్దుతామని చెబుతోందని ఎద్దేవా చేశారు. భాజపా.. దేశాన్ని అమ్మేసిందని ఆరోపించిన దీదీ, బంగాల్ ఎన్నికలలో పాల్గొనే ముందు వారి పార్టీ సంగతి చూసుకోవాలన్నారు. అంపన్ తుపాను సాయంపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ప్రజలకు హాని తలపెట్టే పౌరసత్వ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి :మహారాష్ట్ర స్పీకర్ రాజీనామా.. కారణమిదే!